ఏ ముహూర్తాన ఏపీ సీఐడీ పోలీసులు రఘురామ కృష్ణరాజుని అరెస్ట్ చేశారో తెలియదు గాని.., అప్పటి నుండి ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ఎలాంటి నోటీసులు, వారెంట్ చూపించకుండా.., స్పీకర్ అనుమతి లేకుండా, ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారంటూ.. రఘురామ వర్గీయులు పెద్ద ఎత్తున ప్రశ్నలు కురిపించారు. కానీ.., హైకోర్టు ఈ విషయంలో ఎక్కడా ప్రభుత్వవాన్ని ప్రశ్నించలేదు. ఇక రఘురామ కృష్ణరాజు బెయిల్ పిటీషన్ ని కూడా హై కోర్ట్ కొట్టేసిన విషయం […]
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను తుఫానుకి కారణం అవుతోంది. ఇప్పటికే ఈ అరెస్ట్ పై వివిధ పార్టీల నేతలు స్పందించారు. ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగారు. ఎంపీ రఘురామ కృష్ణరాజుని శుక్రవారం ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రఘురామరాజుపై ఐపీసీ- 124 ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు […]
రాష్ట్ర ప్రభుత్వంపైనా, ప్రభుత్వ పెద్దలపైనా వరుసగా విమర్శల బాణాలు సంధిస్తున్న అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. తమ ఉన్నతాధికారుల సూచనల మేరకు రఘురామ అరెస్టుకు జవాన్లు సహకరించారు. ఆ వెంటనే రఘురామను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సొంత వాహనంలో వస్తానని రఘురామ చెప్పినా వినిపించుకోలేదు. ఆయనను బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. ఒక దశలో ఆయనను వాహనంలోకి బలవంతంగా తోసేశారు. ఎంపీ తనయుడు సీఐడీ పోలీసులను అడ్డుకోగా కోర్టులోనే తేల్చుకోండని స్పష్టం […]
హైదరాబాద్- ఆంద్రప్రదేశ్ నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఏపీ సీఐడీ పోలీసులు రఘురామ కృష్ణ రాజును హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఎంపీ రఘురామ ఇంటిపై ఒక్కసారిగా దాడి చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ శుక్రవారం రాత్రి అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. నర్సాపురం ఎంపీ రఘురామ […]
ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేతలను ఒక్కొక్కరుగా జైలుకి పంపిస్తున్న జగన్ సర్కార్.. ఇప్పుడు తన సొంత పార్టీ ఎంపీకే షాక్ ఇచ్చింది. నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని ఎంపీ రఘురామ నివాసానికి సీఐడీ పోలీసులు శుక్రవారం వెళ్లారు. ఈ సందర్భంగా సీఐడీ పోలీసులతో ఎంపీ రఘురామ కృష్ణరాజు వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు […]