ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ది పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా పలు కీల్ నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వ వలసిన డీఏలను విడుదల చేస్తూ సోమవారం ఉత్వర్వులు జారీ చేసింది. గత కొంత కాలంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల తమ డీఏ విడుదల చేయాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త డీఏను జూలై 1, 2023 నుంచి జీతంతో కలిపి అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యొగులు, పెన్షనర్లకు జగన్ సర్కార్ శుభవార్త తెలిపింది. 2022 జనవరి 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఏలను సోమవారం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీ.ఒ. ఎఎస్. నెం. 66 ద్వారా ఉద్యోగులకు డీఏ, జీ.ఒ. ఎఎస్. నెం. 67 ద్వారా పెన్షనర్లకు డీఆర్ 2.73 శాతం మంజూరు చేసింది. అయితే ఈ కొత్త డీఏను ఈ ఏడాది జూలై 1 నుంచి జీతంతో కలిపి ప్రభుత్వం అందజేయనుంది.
ఇక జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు ఇవ్వాల్సిన డీఏ బయాకలను విడతల వారీగా అంటే సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో మూడు సమాన వాయిదాల్లో ఆ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలుస్తుంది. ఈ కొత్త డీఏతో కలిపి ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం డీఏ 22.75 శాతం అవుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే ఎప్పటి నుంచి తాము కోరుతున్న డీఏ పెంచినందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.