బిగ్ బాస్- మానస్ ను ప్రేమిస్తున్నానని చెప్పిన ప్రియాంక సింగ్

స్పెషల్ డెస్క్- బిగ్ బాస్ తెలుగు సీజన్ 5.. ఈ బుల్లితెర రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి రోజు కంటెస్టెంట్స్ మధ్య జరగుతున్న ఆట అందరిలో ఆసక్తి రేపుతోంది. ఒక్కో వారం ఒక్కొక్కరు బిగ్ బాస్ హౌడ్ నుంచి ఎలిమినేట్ అవుతూ వస్తుండటంతో వారం వారం ఉత్కంఠ రేపుతోంది.

చాలా మంది కంటెస్టెంట్లకు అప్పటివరకు రాని గుర్తింపు బిగ్‌ బాస్‌ ద్వారా వస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇవన్నీ పక్కన పెడితే బిగ్‌ బాస్‌ హౌస్‌ లో లవ్‌ ట్రాక్‌ ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బిగ్ బాస్ హౌజ్ మహత్యం ఏంటో గానీ.. అప్పటివరకు ఎలాంటి కనెక్టివిటి లేని వాళ్లు సైతం మంచి స్నేహితులుగా మారిపోతున్నారు. మరి అక్కడితో ఆగితే ఎలా.. అందుకో మరికొందరు ఆ రిలేషన్‌ ను మరింత ముందుకు తీసుకెళ్తూ.. ప్రేమలో పడిపోతున్నారు.

big boss 5 manas priyanka

ప్రియాంక సింగ్‌ అలియాస్ పింకి అలాంటి ప్రేమలోనే పడిపోయింది. రోజు రోజుకి తన సహచర కంటెస్టెంట్ మానస్‌ పై పెంచుకుంటున్న ప్రేమను పింకి బయటపెట్టింది. నవంబర్‌ 22 సోమవారం జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్‌ లో పింకీ మానస్‌ కు తన మనసులో మాట చెప్పేసింది. తాను మానస్ ను ప్రేమిస్తున్న సంగతిని చెప్పేసింది. నేను నిన్ను ఇష్టపడుతున్నానేమో అనిపిస్తుంది.. మొదటి రోజు నుంచి నిన్ను చేస్తుంటే ఏదో తెలియని పాజిటివ్‌ ఎనర్జీ అనిపిస్తుంది.. అని చెప్పుంది పింకి.

అంతే కాదు.. ఇది కరెక్ట్‌ కాదన్న సంగతి నాకు తెలుసు.. కానీ నీ విషయంలో నాకు బాగా అనిపిస్తుంది.. అంటూ తన మనసులో మాటను ఓపెన్ గా చెప్పేసింగి ప్రియాంక సింగ్. ఇది బిగ్‌ బాస్‌ అన్‌ సీన్‌లో ప్లే అయ్యింది. ఇలా పింకి, మానస్ కు తన ప్రేమను వ్యక్తం చేయడం బిగ్ బాస్ హౌజ్ లో ఆసక్తికరంగా మారింది. మరి పింకి ప్రపోజ్ కు మానస్ ఎలా స్పందిస్తాడన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.