వ్యాక్సిన్ వేసుకోండి బాబ్బాబూ… లాటరీ గెలవండి.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కరోనా ఉధృతి పెరిగిపోతుంది. ప్రపంచ దేశాలని చైనా నుంచి పుట్టుకొచ్చిన ఈ వైరస్ పట్టి పీడిస్తుంది.ఇప్పటికే ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాణ నష్టం జరిగింది. అలాగే అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థని కూడా ఈ వైరస్ దెబ్బతీసింది.ముఖ్యంగా భారత్ ని ఈ కరోనా సెకండ్ వేవ్ బాగా దెబ్బ తీస్తుంది.ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని కట్టడి చెయ్యడానికి తప్పనిసరిగా జనాలు వ్యాక్సిన్ వేయించుకోవాలి. మన దేశంలో ప్రజలు ఈ కరోనా టీకా తీసుకోడానికి సిద్ధంగా ఉన్నా ఆ అవకాశం చాలా మందికి రావడం లేదు. అయితే, వేరే దేశాల్లో మన లాగా కాదు. ఆ దేశాల్లో మాత్రం వారి ప్రభుత్వాలే ప్రజలను టీకా తీసుకోని సురక్షితంగా ఇంకా ఆరోగ్యంగా ఉండి కరోనాని ఎదుర్కోండి అంటూ బాగా మొత్తుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు వివిధ బహుమతులు ప్రకటించి ప్రజలను వ్యాక్సిన్ సెంటర్లకు రప్పించుకుంటున్నాయి.

NO2RCPCJ3BH2RD5UYFSU7HG3UY

రీసెంట్ గా ఒహియోలో ఏకంగా లాటరీ పెట్టేశారు. ఈ సందర్భంగా ఒహియో గవర్నర్ మైక్ డివైన్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ ప్రక్రియను ప్రోత్సహించేందుకు లాటరీలతోపాటు విద్యార్థులకు సైతం ప్రోత్సాహాలను అందిస్తామని తెలిపారు. ఒక మిలియన్ డాలర్ (ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం 7.34 కోట్లు) లాటరీని సొంతం చేసుకొనే అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జూన్ 2 నుంచి అక్కడ పలు షరుతులతో లాక్‌డౌన్ నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించనున్నారు.