పుట్టినరోజు నాడు బిర్యానీ ఉచితంగా వడ్డించే రెస్టారెంట్ ఉందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. పుట్టినరోజు నాడు ఎవరైనా వెళ్తే వారికి ఎలాంటి బిల్లు లేకుండా బిర్యానీ కడుపు నిండుగా వడ్డిస్తారు.
బర్త్ డే అయినా, ప్రమోషన్ అయినా.. అకేషన్ ఏదైనా గానీ పార్టీ అంటే ఏ రెస్టారెంట్ కో పోవాల్సిందే. బిర్యానీ ఆర్డర్ చేయాల్సిందే. బాగా తిని ఎంజాయ్ చేయాల్సిందే. అయితే పుట్టిన రోజు నాడు బిర్యానీ ఫ్రీగా తినచ్చునని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే. జస్ట్ మీ ఆధార్ కార్డు చూపిస్తే చాలు.. ఆ రెస్టారెంట్ లో ఫ్రీగా బిర్యానీ పెడతారు. ఈరోజుల్లో చాలా మంది పుట్టినరోజుని రెస్టారెంట్లలో జరుపుకుంటున్నారు. అక్కడే పార్టీ చేసుకుని ఆ తర్వాత కేక్ కటింగ్ చేయిస్తున్నారు. అయితే ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ అంటే మినిమమ్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వాల్సిందే. మనిషికో బిర్యానీ అంటే ఓ ఐదారు మంది ఉన్నా బిల్లు గట్టిగానే అవుతుంది. ఏ రెస్టారెంట్ కి వెళ్లినా బిల్లు మోతమోగిపోద్ది.
అయితే మీ బిల్లు తగ్గాలంటే.. ఫ్రీ బిర్యానీ కావాలంటే కనుక ఈ రెస్టారెంట్ కి వెళ్లాల్సిందే. బర్త్ డే రోజున ఈ రెస్టారెంట్ కి వెళ్తే బిర్యానీ ఫ్రీగా పెడతారు. ఆఖరున ఒక స్వీట్ కూడా ఇస్తారు. మరి ఆ రెస్టారెంట్ ఎక్కడుందో తెలుసా? కూకట్ పల్లిలోని చెన్నై షాపింగ్ మాల్ పక్కనే ఉంది. ఆథంటిక్ తెలుగు క్యూజిన్ (ఏటీసీ) రెస్టారెంట్ వారు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎవరైనా పుట్టినరోజు నాడు ఈ రెస్టారెంట్ కి వెళ్తే ఉచితంగా హైదరాబాదీ ధమ్ బిర్యానీ వడ్డిస్తామని అంటున్నారు. పుట్టినరోజు చేసుకోవడానికి చాలా మంది తమ రెస్టారెంట్ కి వస్తారని.. అయితే అలాంటి వారి కోసం ఏదైనా చేయాలనిపించి ఫ్రీగా బిర్యానీ వడ్డిస్తున్నట్లు రెస్టారెంట్ వారు చెబుతున్నారు. ఈ ఆఫర్ ని రీసెంట్ గా లాంఛ్ చేశామని.. రోజూ చాలా మంది వచ్చి బిర్యానీ తిని వెళ్తున్నారని అన్నారు.
మొదట్లో పబ్లిసిటీ స్టంట్, అబద్ధం అనుకున్నారని.. కానీ నిజం అని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే బర్త్ డే రోజున బిర్యానీ ఫ్రీగా తినాలంటే ఆధార్ కార్డు చూపించాల్సిందే. ఆరోజు డేటాఫ్ బర్త్ కరెక్ట్ గా ఉంటే బిర్యానీ ఉచితంగా వడ్డిస్తారు. అయితే ఈ ఆఫర్ కేవలం పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తికీ మాత్రమే వర్తిస్తుంది. అంటే ఆరోజు ఎవరి బర్త్ డే అయితే ఉంటుందో వారికి మాత్రమే ధమ్ బిర్యానీ ఉచితం అన్న మాట. అలా చూసినా గానీ ఒకరికి ఫ్రీ అంటే మంచి విషయమే కదా. అసలే అతుకుల, గతుకుల బతుకులు. బిల్లు తగ్గుతుందంటే అంతకు మించిన సంతోషమ్మ ఇంకేముంటుంది చెప్పండి. అయితే కేవలం బిర్యానీ మాత్రమే పెడతారు. మిగతావి టేస్ట్ చేయాలంటే బిల్లు కట్టాల్సిందే.