అస్సాం రాష్ట్రం గోలాఘాట్ జిల్లాలో ఓ విచిత్రమైన కేసు ఎదురైంది. అక్కడి పోలీసులు ఓ ఏనుగును దాని పిల్లను అరెస్టు చేశారు. అరెస్టు చేయడమే కాదు, ఒక నేరస్తుడికి బేడీలు ఎలా అయితే వేస్తారో, ఈ ఏనుగులకు కూడా బేడీల రూపంలో ఇనుప గొలుసులతో కట్టేశారు. మనిషి అయితే స్టేషన్‌లోని సెల్‌లో వేస్తారు. కానీ ఇవి భారీ శరీరం ఉన్న గజరాజులు కావడంతో స్టేషన్ బయటే కట్టిపడేశారు. ఆ పై సెక్షన్ 304కింద కేసు నమోదు చేశారు. […]
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తోన్న కరోనా మందు ఉచిత పంపిణీ కార్యక్రమం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కరోనా మందుకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే కొందరు అక్రమార్కులు తన కరోనా మందుకు నకిలీ మందు తయారు చేసి అమ్ముకుంటున్నట్లు ఆనందయ్య ఆరోపించారు. కొందరు తయారు చేస్తున్న నకిలీ మందు వికటిస్తే దానికి తాను బాధ్యుడిని కానని ఆనందయ్య హెచ్చరించారు. ఆనందయ్య మందు అంటూ మార్కెట్లోకి వచ్చేసిన నకిలీ […]
29 ఏళ్ల జాక్వి విలియమ్స్ ‘గ్రేవ్ మెటల్లమ్ జ్యువెలరీ’ సంస్థనే ఏర్పాటు చేసింది. చనిపోయిన వ్యక్తులు ఎప్పటికీ గుర్తిండిపోయేలా తమ వద్ద ఏదైనా వస్తువు ఉంటే బాగుంటుందని చాలామంది భావిస్తారు. అలాంటివారి కోసమే జాక్వి ఈ సంస్థను ఏర్పాటు చేసింది. కుటుంబికులు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన దంతాలు, జుట్టు లేదా బూడిద ఏది తీసుకొచ్చినా జాక్వి వాటిని అందమైన నగలుగా మార్చేస్తుంది. జాక్వీ 2017లో జ్యువెలరీ తయారీలో డిప్లమా చేసింది. ఆ తర్వాత ఆమెకు ఎక్కడా ఉద్యోగం […]
తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదేశాలతో తమిళనాడు పోలీసులు కో వ్యాక్సిన్, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో విక్రయించే వారి పనిపట్టడానికి రంగంలోకి దిగారు. ప్రజల ప్రాణాలతో కూడా వ్యాపారం చెయ్యాలని ప్రయత్నిస్తున్న కేటుగాళ్ల భరతం పట్టాలని సీఎం ఎంకే. స్టాలిన్ ఆదేశాలు జారీ చెయ్యడంతో పోలీసులతో పాటు డీఎంకే పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వసూలు చేసిన జరిమానాను పోలీసులు బాధితుడి ఇంటికే వెళ్లి అందజేశారు. మేము ఆక్సిజన్ కూడా బ్లాక్ […]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కరోనా ఉధృతి పెరిగిపోతుంది. ప్రపంచ దేశాలని చైనా నుంచి పుట్టుకొచ్చిన ఈ వైరస్ పట్టి పీడిస్తుంది.ఇప్పటికే ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాణ నష్టం జరిగింది. అలాగే అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థని కూడా ఈ వైరస్ దెబ్బతీసింది.ముఖ్యంగా భారత్ ని ఈ కరోనా సెకండ్ వేవ్ బాగా దెబ్బ తీస్తుంది.ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని కట్టడి చెయ్యడానికి తప్పనిసరిగా జనాలు వ్యాక్సిన్ […]
మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. మెట్రో వంతెన కూలి బోగీలు కిందపడి 15 మంది చనిపోయిన ఘటన మెక్సికో రాజధానిలో చోటుచేసుకుంది. మెక్సికో సిటీలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 70 మందికి గాయాలుకాగా వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వంతెన కూలిపోవడంతో దాని కింద నుంచి వెళ్తోన్న కార్లపై మెట్రో బోగీలు పడ్డాయి. దీంతో భారీ సంఖ్యలో జనం గాయపడ్డారు. స్థానిక కాలమానం […]