ఇటీవల భారీ వర్షాలు కురియడంతో టమాటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్ లో టమాటా ధరలు ఆకాశాన్నంటిపోయాయి. ప్రస్తుతం టమాటా సాగు చేసి దిగుబడి చేస్తున్న రైతులు లక్షలు, కోట్లు అర్జిస్తున్నారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.. వీటికి తోడు మార్కెట్ లో కూరగాయల ధరలు సైతం పెరగడంతో సామాన్యులు సతమతమవుతున్నారు. సాధారణంగా ఏ కూరలో అయినా టమాటా వేస్తే ఆ టేస్టే వేరు. కానీ ఇప్పుడు సామాన్యుడు మార్కెట్ లోకి వెళ్లి టమాటా కొనాలంటే భయపడిపోతున్నారు. నెల రోజులుగా దేశంలో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. రూ. 100 నుంచి రూ.300 వరకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రేటు పలుకుతుంది. ఇటీవల భారీగా వర్షాలు కురియడంతో దిగుబడులు భారీగా తగ్గడంతో టమాటాకు డిమాండ్ వచ్చింది. ఓ వైపు సామాన్యులు టమాటా కొనేందుకు హడలిపోతుంటే.. టమాటా రైతులు మాత్రం తెగ సంతోషంలో మునిగిపోతున్నారు. ఇదే నెలలో దిగుబడి వచ్చేలా సాగు చేసిన టమాటా రైతులు భారీ లాభాలను అందుకుంటున్నారు. తాజాగా ఏపీకి చెందిన ఓ రైతు టమాటా సాగుతో కోట్లు ఆర్జించాడు. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నెలలో దిగుబడి వచ్చేలా టమాటా సాగు చేసిన రైతులు కోట్లు అర్జిస్తున్నారు. సోషల్ మీడియాలో పలు రాష్ట్రల్లో టమాటా సాగు చేసిన రైతులు కోటీశ్వరులు అయినట్లు తెగ కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. మెదక్ జిల్లాలో మహిపాల్ రెడ్డి అనే రైతు టమాటా సాగు చేసి రూ.2 కోట్ల విలువ చేసే టమాటాలను విక్రయించిన సంగతి తెలిసిందే. ఏపీకి చెందిన మరో రైతు టమాటా విక్రయం ద్వారా నెల రోజుల్లోనే ఏకంగా రూ.3 కోట్ల ఆదాయం గడించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాకు చెందిన సోమల మండలానికి చెందిన చంద్రమౌళి తన తమ్ముడు, తల్లితో కలిసి ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నాడు. కరకమందలో 12 ఎకరాలు, పులిచెల్ల మండలంలో 20 ఎకరాల పొలం కలిగి ఉన్న చంద్రమౌళి చాలా కాలంగా టమాటా పంట సాగు చేస్తున్నాడు.
ఈ ఏడాది కూడా చంద్రమౌళి తన పొలంలో టమాటా పంట వేశాడు. అనూహ్యంగా నెల రోజులుగా టమాటా ధరలు చుక్కలు అంటుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్ లో కిలో టమాటా ధర రూ.120 నుంచి రూ.150 వరకు పలుకుతుంది. ఈ క్రమంలో చంద్రమౌళి తన 22 ఎకరాల్లో టమాటా సాగు చేయడంతో అది ఇప్పుడు బంగారు పంటగా మారింది. చంద్రమౌళి తన పొలంలో కట్టెసాగు విధానంలో మల్చింగ్, సూక్ష్మ సేద్య పద్దతులను పాటిస్తుంటాడు. ఇగా సాగు చేసిన పంట జూన్, జులై నాటికి చేతికి రావడం బాగా కలిసి వచ్చిందని అంటున్నాడు చంద్రమౌళి. జూన్ చివరి లో దిగుబడి మొదలు కాగానే కర్ణాటకలోని కోలార్ మార్కెట్ లో విక్రయించామని అన్నారు. 15 కిలోల టమాటా బాక్స్ ధర రూ.1000 నుంచి రూ.1500 మధ్య పలికిందని.. ఈ రేట్ తన జీవితంలో చూడలేదని అన్నాడు. తాను 40 వేల పెట్టెలను విక్రయించగా రూ.4 కోట్ల ఆదాయాం వచ్చిందని.. పెట్టుబడి రూ.70 లక్షలు, కమిషన్ గా 20 లక్షలు, రవాణా ఖర్చలు 10 లక్షలు పోను.. చేతికి రూ.3 కోట్టు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశాడు చంద్రమౌళి.