‘మా’ ఎన్నికల్లో నా బిడ్డ చాలా వాగ్దానాలు చేశాడు, అన్నింటినీ.. మోహన్ బాబు

ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ‘మా’ ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా సాగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఘన విజయం సాధించగా, ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓటమిపాలైంది. ‘మా’ అధ్యక్ష్య పదవి పోటీలో 107 ఓట్ల ఆధిక్యంతో మంచు విష్ణు ప్రకాష్ రాజ్‌పై గెలుపొందారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు మంచు విష్ణును అభినందిస్తూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు వెన్నుముకగా ఉంటూ ఆయన గెలుపును ఆహర్నిశలు కష్టపడిన ఆయన తండ్రి, డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ఎలక్షన్ రిజల్ట్స్ తరువాత స్పందించారు. ‘మా’ ఎన్నికల్లో గెలుపొందిన తన బిడ్డ విష్ణుకి కృతజ్ఞతలు చెప్పిన ప్రతి ఒక్కరికీ మొహన్ బాబు ధన్యావాదాలు తెలిపారు. ఈ క్రమంలో తమ భవిష్యత్ ప్రణాళిక, ‘మా’ గొడవలు, ఆర్టిస్టుల మధ్య విభేదాల వంటి వాటిపై ఆయన రియాక్ట్ అయ్యారు.

mohan babu 1

‘మా’ ఎన్నికల్లో గెలుపొందడం ఆనందంగా ఉందన్న మొహనా బాబు, ఇది ఏ ఒక్కరి విజయం కాదని అన్నారు. 800లకు పైగా ఉన్న ‘మా’ సభ్యుల విజయమని ఆయన వ్యాఖ్యానించారు. ‘మా’ ఎన్నికల్లో విష్ణు చాలా వాగ్దానాలు చేశారని, తన బిడ్డ అన్నీ నెరవేర్చుతారని మొహనా బాబు తెలిపారు. ‘మా’ ఎన్నిక్లలో జరిగిందేదో జరిగిపోయిందని, ఇక నుంచి అందరం ఒక తల్లి బిడ్డలం అనుకోవాలని చెప్పారు.

తనకు నటుడిగా జన్మనిచ్చిన దాసరి నారాయణరావు ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం కావాలని ఆకాంక్షించేవారని, ఇకపై ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలా చూసుకుంటామని మోహన్ బాబు అన్నారు. ఇకపై వివాదాలకు దూరంగా ఉంటామని ఆయన చెప్పారు. ‘మా’ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులంతా క్రశిక్షణతో ఉండాలని, ‘మా’ అధ్యక్షుడి అనుమతి లేనిదే మీడియా ముందుకు వెళ్లరాదని సూచించారు.