భారత్‌ కోలుకో…నయాగరా నయా సందేశం!..

కరోనా ధాటికి గజగజ వణుకుతున్న భారతదేశానికి ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాలు తమకు తోచిన విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాయి. సహాయం చేస్తూనే మరో పక్క భారత్‌ ధైర్యం ఉండు., కోలుకో అంటూ సందేశాలు పంపిస్తున్నాయి.

1597565543 untitled design 46

కొద్ది రోజుల క్రితం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణమైన బుర్జ్ ఖలీఫాపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి.. ‘భారత్ కోలుకో’ అంటూ యూఏఈ సందేశాన్ని పంపించింది. తాజాగా కెనడా కూడా భారత్‌కు తన సంఘీభావాన్ని తెలియజేసింది.

919554 i day illumination

ప్రపంచలోనే అతిపెద్ద జలపాతం అయిన నయాగార జలపాతంపై భారత జాతీయ జెండా రంగులను అరంగపాటు ప్రొజెక్ట్ చేసింది. అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘స్టే స్ట్రాంగ్ ఇండియా’ అని పేర్కొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఇప్పుడు తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద జలపాతం పాలనురుగులు కక్కుతూ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే నయాగార రంగు మారింది.