భారత సరిహద్దులో 22 మార్గాలను మూసేసిన నేపాల్‌!..

భారత్‌లో కరోనా తీవ్ర వ్యాప్తి నేపథ్యంలో నేపాల్‌ ప్రభుత్వం భారత సరిహద్దులో ఉన్న 22 ప్రవేశ మార్గాలను మూసివేసేందుకు నిర్ణయం తీసుకుంది. భారత్‌తో ఉన్న 35 బోర్డర్‌ పాయింట్లలో 22 మార్గాలను మూసేయాలని ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కేవలం 13 మార్గాలు మాత్రమే ప్రజల రాకపోకలకు వీలుగా తెరచి ఉన్నాయి. 

632459 mitchi river afp file

భారత్​లో కరోనా విజృంభణ దృష్ట్యా.. ఐర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్​ నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా హోటళ్లలో క్వారంటైన్​లో ఉండాలని ఆదేశించింది. భారత్​తో పాటు జార్జియా, ఇరాన్, మంగోలియా, కోస్టారికా దేశాలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.

Belhiya border

నేపాల్-భారత్‌ మధ్య మొత్తం 35 సరిహద్దు పాయింట్లు ఉండగా అందులో 22 పాయింట్లను మూసేయాలని నేపాల్‌ కొవిడ్‌ క్రైసిస్ మేనేజ్‌మెంట్ కో ఆర్డినేషన్ కమిటీ మంత్రి మండలికి సిఫారసు చేసింది. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని నేపాల్‌ వెల్లడించింది.