ఈరోజు హైదరాబాద్ లో  స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధర

స్వల్పంగా తగ్గిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 250 రూపాయలు తగ్గింది.
10గ్రా 24 క్యారెట్ 270 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్ 10గ్రా బంగారం 45,750.
24 క్యారెట్ 10గ్రా బంగారం 49,910.
1కిలో వెండి 70,400

బిజినెస్ డెస్క్– ఈ రోజు శనివారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 25 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 27 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 250 రూపాయలు తగ్గి 45 వేల 750 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 270 రూపాయలు తగ్గి 49 వేల 910 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 300 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 70 వేల 400 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 150 రూపాయలు  తగ్గింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 160 రూపాయలు తగ్గింది.

Gold 2 1

ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 46 వేల 220 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 50,420 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48,100 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 49,100 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 48,150 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 52,530 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.