అంతర్జాతీయంగా బంగారానికి ఎప్పుడూ డిమాండే ఉంటూనే ఉంది. బంగారం కొనుగోలు ఎక్కువ కావడంతో డిమాండ్ కూడా అదేస్థాయిలో పెరిగి రేట్లు అమాంతం పెరిగిపోయాయి.
ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారతీయ మహిళలు బంగారం అంటే ఎంత మక్కువ చూపిస్తారో తెలిసిందే. ఎలాంటి శుభకార్యాలు జరిగినా తప్పనిసరిగా బంగారాన్ని చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. ఇందుకే గ్లోబల్ మార్కెట్ లో బంగారం ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది. కొన్ని సమయాల్లో తగ్గుముఖం పడుతుంది. తాజాగా బంగారం రేటు పడిపోయింది.. ఇదే బాటలో వెండి రేటు కూడా తగ్గింది. వెండి ఏకంగా రూ. 1900 దిగివచ్చింది. ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీ, హైదరాబాద్ మార్కెట్లో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇటీవల బంగారం కోనుగోలు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ మద్యకాలంలో బంగారంపై పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో బంగారం రేట్లు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వరుసగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధర బంగారం, వెండి ధరలు మళ్లీ దిగివస్తుండడం వినియోగదారులకు ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు. ఆదివారం ఉదయం వరకు నమోదు అయిన రేట్లు చూసుకుంటే.. 22 క్యారెట్ పది గ్రాములు (తులం) బంగారం ధర రూ.250 మేరకు తగ్గింది.. ప్రస్తుతం రూ.55,150 కి చేరింది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం రూ.280 వరకు తగ్గి, ప్రస్తుతం 60,160 కి చేరింది.
దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ బంగారం ధర రూ.55,150 ఉండగా, 24 క్యారెట్ బంగారం ధర రూ.60,320 కి చేరింది. ముంబై మార్కెట్ లో 22 క్యారెట్ ధర రూ.55,150, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,150, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,160 కి చేరింది. బెంగుళూరు లో 22 క్యారెట్లు బంగారం ధర రూ.55,150 ఉండగా 24 క్యారెట్లు బంగారం ధర 60,160 గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,160 కి చేరింది. ఇక వెండి విషయానికి వస్తే.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,000, ముంబైలో రూ.78000, చెన్నైలో రూ.80,500, బెంగుళూరులో రూ.76,500, హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర రూ.80,500 లు గా ఉంది.