తక్కువ ధరకు బంగారం హారం అమ్ముతామని ఆశ చూపించి ఓ బట్టల వ్యాపారిని నమ్మించి..దుండగులు రూ. 3లక్షలు కాజేశారు. వారు వెళ్లిపోయాక తను మోసపోయానని తెలుసుకుని వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు.
ఈ రోజుల్లో మనుషులు మోసం చేయడంలో ఆరితేరిపోయారు. మాయ మాటలు చెప్పి నట్టేట ముంచుతున్నారు. అమాయకులకు వల వేసి డబ్బుల కాజేస్తారు. అందినంత వరకు దోచుకుపోవడమే ఈ దొంగల విద్య. ఈజీ మనీ కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. అందరి ముందు కాకుండా ఒకరు ఉన్నప్పుడు మాట్లాడి వారి సెంటిమెంట్‌ను క్యాచ్ చేసుకుని మోసానికి తెగిస్తున్నారు. ఇలాంటి వాటిలో ఆడవారి పాత్రకూడా ఉంటుంది. మన మధ్యే ఉంటూ మంచివారిలా నటిస్తూ దోచుకుంటారు. నకిలీ వస్తువులు అంటగట్టి డబ్బులతో ఉడాయిస్తారు. తాజాగా తక్కువ ధరకు బంగారం హారం అమ్ముతామని ఆశ చూపించి ఓ బట్టల వ్యాపారిని నమ్మించి..దుండగులు రూ. 3లక్షలు కాజేశారు. వారు వెళ్లిపోయాక తను మోసపోయానని తెలుసుకుని వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే…
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ కు చెందిన ఆనంద్ ఓ బట్టల వ్యాపారి. స్థానికంగా బట్టల షాపు నడిపిస్తున్నాడు. ఓ కొత్త వ్యక్తి బట్టల దుకాణానికి వచ్చాడు. తాను భోపాల్ వాసినని.. డిచ్ పల్లిలో ఉంటూ కూలిపనులు చేసుకుంటున్నట్లు తెలిపాడు. ఆనంద్ తో మాటమాట కలిపి పరిచయం పెంచుకున్నాడు. తను పని చేసే చోట బంగారు హారం ఒకటి దొరికిందని చెప్పాడు. దానిని అతితక్కువ ధరకు అమ్ముతానని చెప్పి వెళ్లిపోయాడు. ఈ నెల 17న గుర్తు తెలియని ఇద్దరి వ్యక్తులతో ఓ మహిళ కూడా బట్టల దుకాణానికి వచ్చారు. హారాన్ని ఇచ్చి పరీక్షించుకోమని చెప్పారు. ఆనంద్ ఓ గుండుని కట్ చేసి స్వర్ణకారుల వద్ద పరీక్షించుటకు ఇవ్వగా అసలైన బంగారం అని తేల్చారు. ఇది నమ్మిన ఆనంద్ రూ. 3లక్షల కు మాట్లాడి బేరం కుదుర్చుకున్నాడు. ఈ నెల 20న కామారెడ్డిలో వారికి డబ్బుల చెల్లించి హారం తీసుకున్నాడు. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత హారం పరీక్షించగా నకిలీదని తేలింది. మోసపోయానని తెలుసుకుని ఆనంద్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.