బంగారం కొనే వారికి షాకిస్తూ ధరలు పరుగులు పెడుతున్నాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగి గోల్డ్ ప్రియులకు షాకిస్తున్నాయి. కాగా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఈవిదంగా ఉన్నాయి.
బంగారం కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. నిన్న తగ్గుముఖం పట్టిన గోల్డ్ ధరలు ఈ రోజు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకున్న ఒడిదుడుకుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. ధర ఎంత పెరిగినా డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గదు. పసిడి ప్రియులు బంగారం కొనడానికి వెనకాడరు. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.253 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1959.85 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.36 డాలర్ల వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ శుభకార్యమైనా బంగారం కొనకుండా ఉండలేరు మహిళలు. వారు అమితంగా ఇష్టపడే బంగారం ధరలు అంతకంతకు పెరుగుతుండటంతో నిరాశ చెందుతున్నారు. కాగా ఈరోజు బంగారం హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 250 పెరిగి రూ. 55,350కు చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 270 పెరిగి రూ. 60,380 వద్ద కొనసాగుతోంది. సిల్వర్ రేటు కూడా పెరుగుతూ షాకిస్తుంది. హైదరాబాద్‌లో తాజాగా రూ. 500 పెరిగి మళ్లీ కిలో వెండి రూ. 80 వేలు తాకింది. విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350 వద్ద కొనసాగుతోంది.. 24క్యారెట్ల బంగారం ధర రూ.60,380 వద్ద కొనసాగుతుంది.
జూలై 30న 22 క్యారెట్ల బంగారం ధరలు:
1 గ్రాము: ₹ 5,535 ( ₹ +25 )
8 గ్రాములు: ₹ 44,280 ( ₹ +200 )
10 గ్రాములు: ₹ 55,350 ( ₹ +250 )
100 గ్రాములు: ₹ 5,53,500 ( ₹ +2500 )
జూలై 30న 24 క్యారెట్ల బంగారం ధరలు:
1 గ్రాము: ₹ 6,038 ( ₹ +27 )
8 గ్రాములు: ₹ 48,304 ( ₹ +216)
10 గ్రాములు: ₹ 60, 380 ( ₹ +270 )
100 గ్రాములు: ₹ 6,03,800 ( ₹ +2700 )
జూలై 30న వెండి ధరలు:
1 గ్రాము: ₹80 ( ₹ +0.50 )
8 గ్రాములు: ₹ 640 ( ₹ +4 )
10 గ్రాములు: ₹ 800 ( ₹ +5 )
100 గ్రాములు: ₹ 8000 ( ₹ +50 )
1000 గ్రాములు: ₹ 80000 ( ₹ +500 )