కొడాలి నాని తో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు!

kodali nani security

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో.. నలుగురు ఎమ్మెల్యేలకు భద్రత పెంచారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేశారని తెదేపా నాయకులు ఆరోపించిన పలువురు ఎమ్మెల్యేకు భద్రత పెంచడం విశేషం. ఈ లిస్ట్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు ఉన్నారు.వీరి నలుగురికి భద్రత పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వీరికి ఉన్న వ్యక్తిగత సెక్యూరిటీ 1+1 ఉండగా దానిని 4+4 చేసింది.

అసెంబ్లీలో తనకి అవమానం జరిగిందని, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అంటూ చంద్రబాబు సభ నుండి బయటకి వెళ్ళిపోయిన విషయం తేలింసిందే. ఆ తరువాత జరిగిన ప్రెస్ మీట్ లో బాబు కన్నీరు పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలోనే టీడీపీ శ్రేణులు ఈ నలుగురు ఎమ్మెల్యేలకు పై బెదిరింపు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో వైసీపీ నాయకులు పోలీసులకి కంప్లైంట్స్ కూడా చేశారు. ఈ పరిణామాలను ఆధారంగా చేసుకుని నాయకులకు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో మంత్రి కొడాలి నాని మాత్రం 2+2 గన్‌మెన్లతో పాటూ 1+4 గన్‌మెన్ల భద్రత పెంచారు.. 17మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు.. అలాగే కాన్వాయ్‌కు అదనంగా మరో వాహనాన్ని కేటాయించారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.