పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్యామ్ బాబు అనే పాత్ర గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
సినిమాల్లో వ్యక్తులను, వ్యవస్థలను, ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకులను టార్గెట్ చేయడం మామూలే. ఆయా హీరోలు తమ సినిమాల్లో పరోక్షంగా సెటైరికల్ డైలాగ్స్ వేస్తుంటారు. ఫ్యాన్స్ కూడా సూపర్ అంటూ చప్పట్లు కొడతారు. ఆ మధ్య బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలోని ఓ సన్నివేశంలో చెప్పిన డైలాగులు పరోక్షంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టు తెలిసిందే. గతంలో ఇలా చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని సినిమాలు వివాదాలకు దారి తీశాయి. ఆ తర్వాత ఆ డైలాగులను మార్చడం కూడా జరిగాయి. పవన్ కళ్యాణ్ కూడా గతంలో విడుదలైన వకీల్ సాబ్ సినిమాలో కూడా పరోక్షంగా సెటైరికల్ డైలాగ్స్ వేశారు.
తాజాగా మరోసారి పవన్ పరోక్షంగా ఏపీ మంత్రిపై సెటైరికల్ డైలాగులు వేశారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ జూలై 28న విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ నటుడు, దర్శకుడు అయినటువంటి సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశం ఉంది. కమెడియన్ పృథ్వీ రాజ్ ఇందులో డ్యాన్స్ ఫన్నీగా డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ చూసిన నెటిజన్స్.. గతంలో సంక్రాంతి సంబరాల్లో మహిళలతో కలిసి ఏపీ మంత్రి అంబటి రాంబాబు వేసిన డ్యాన్స్ తో పోలుస్తున్నారు.
పృథ్వీ వేషధారణ, డ్యాన్స్ స్టెప్పులు, శ్యాంబాబు పేరు ఇవన్నీ కూడా ఏపీ మంత్రిని ఉద్దేశించి చేసినవే అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే దీనిపై అంబటి రాంబాబు స్పందించారు. బ్రో మూవీలో వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియో క్లిప్ పై స్పందిస్తూ అంబటి రాంబాబు తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ‘గెలిచినోడి డ్యాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డ్యాన్స్ కాళరాత్రి’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. మరి వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.