నెలకి 7.3 లక్షల సాలరీ!. ప్రయత్నించండి – ఆలస్యం అమృతం విషం!

బహామాస్‌లో నివసిస్తున్న ఓ ఉన్నత కుటుంబం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారి ప్రైవేట్ ఐలాండ్‌లో పనిచేస్తే ఏడాదికి 1,20,000 డాలర్లు (ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం రూ.88 లక్షలు) చెల్లిస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న జంటలకు బంపర్ ఆఫర్, ఈ ప్రైవేట్ దీవిలోని ఇంట్లో పనిచేస్తే ఏడాదికి రూ.88 లక్షలు సంపాదించవచ్చు. అంటే నెలకు సుమారు రూ.7.3 లక్షలు చేతికి అందుతాయి. అయితే, వీరు కేవలం పెళ్లయిన జంటకు మాత్రమే ఈ అవకాశం ఇస్తారు. జీతం బాగానే ఉంది కదా దరఖాస్తు చేసుకుందామని అనుకుంటున్నారా? అయితే, తొందరపడకండి. అక్కడ ఏం పని చేయాలో కూడా తెలుసుకోండి. ఈ పనిలో కుదిరే జంట ఫ్లొరిడా, బ్రహ్మాస్‌లో ఆ కుటుంబానికి గల అన్ని ఇళ్లల్లో పనిచేయాల్సి ఉంటుంది. Polo & Tweed వెబ్‌సైట్‌లో ఈ ఉద్యోగానికి సంబంధించిన వివరాలు ఉంచారు. ఈ ఉద్యోగం చేసే జంటకు జీతంతోపాటు హెల్త్‌కేర్, డెంటల్ బెనిఫిట్స్‌తోపాటు ఒక కారు కూడా ఇస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాలి. ఒక్కోసారి వీకెండ్‌తోపాటు రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఈ పనికి ఎవరినిపడితే వారిని తీసుకోమని స్పష్టం చేశారు. వారి పనితీరు నచ్చితే జీవితకాలం తమతోనే ఉండవచ్చని ఆ కుటుంబం పేర్కొంది. ఏప్రిల్ 28న ఈ ప్రకటన చేయగా.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మంచి అనుభవం ఉండేవారిని ఎంపిక చేసుకొనే పనిలో ఆ కుటుంబం ఉంది. మరీ ఈ లక్కీ ఛాన్స్ ఎవరికి లభిస్తుందో!