అందరు కష్టపడి ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. ఇటీవల అమెరికాలో ఫ్లోరిడా మెగా మిలియన్స్ లాటరీలో ఓ వ్యక్తి ఏకంగా 1.58 బిలియన్ డాలర్ల జాక్‌పాట్ కొట్టాడు. అందరూ ఇప్పుడు విజేత కోసం ఎదురు చూస్తున్నారు.
జీవితంలో ఏదో ఒక్కసారి అదృష్టం తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని అందుకున్న వారిని అదృష్టం వరిస్తుంది. కొంతమంది పొద్దున నిద్ర లేచినప్పటి నుండి కష్టపడుతూనే ఉంటారు. కానీ జీవితంలో ఏమాత్రం ఎదుగుదల కనిపించదు. కానీ కొందరు కొద్దిపాటి ప్రయత్నంలోనే విజయం సాధించేస్తారు. అందరు కష్టపడి ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. ఇటీవల ఓ వ్యక్తి చెత్తలో తన తండ్రి బ్యాంక్ పాస్‌బుక్ దొరికి.. రాత్రికి రాత్రి ఓ వ్యక్తి కోటీశ్వరుడు అయ్యాడు. అలాగే ఓ రైతు తన పొలంలో దొరికిన వజ్రంతో కోటీశ్వరుడు అయ్యాడు. నూతన వధూవరుల జంటకు బంగారం గెలుపొందే అవకాశం లభించింది. లాటరీలో కూడా కేరళ వ్యక్తి కి అనుకోకుండా జాక్ పాట్ తగిలింది. దీంతో అతను కోటీశ్వరుడు అయ్యాడు. అలాగే అమెరికాలో కూడా ఏకంగా రూ.13 వేల కోట్లను లాటరీ ద్వారా గెలుపొందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికాలో ఫ్లోరిడా మెగా మిలియన్స్ లాటరీలో ఓ వ్యక్తి ఏకంగా 1.58 బిలియన్ డాలర్ల జాక్‌పాట్ కొట్టాడు. అయితే ఆ విజేత వివరాలు తెలయలేదు. నెప్యూన్ బీచ్ లోని పబ్లిక్స్ స్టోర్ అమ్మకందారుడు ఈ టికెట్‌ను అమ్మారు. మంగళవారం డ్రా తీశారు. అందులో 13,19,20,32,33,14 నంబరు టికెట్‌కు జాక్‌పాట్ తగిలినట్లు తెలిపారు. అమెరికా చరిత్రలోనే మూడవ అతిపెద్ద లాటరీ ఇదేనని అక్కడి వర్గాలు తెలుపుతున్నాయి. తను గెలుపొందిన 1.58 డాలర్ల నగదును సంవత్సరానికి కొంత చొప్పున 30 ఏళ్ల వరకు చెల్లిస్తారు. అలా కాకుండా ఒకేసారి నగదు మొత్తాన్ని పొందాలనుకుంటే అతనికి సుమారు 783.3 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 6,488 కోట్లు మాత్రమే చెల్లించబడుతుంది.
అందరూ ఇప్పుడు విజేత కోసం ఎదురు చూస్తున్నారు. డ్రా తీసిన 180 రోజులలోపు బహుమతులు తప్పనిసరిగా క్లెయిమ్ చేయాలి. గెలుచుకున్న నగదు $1 మిలియన్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా తల్లాహస్సీలోని ఫ్లోరిడా లాటరీ ప్రధాన కార్యాలయంలో క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి లాటరీ నిర్వాహకుల ప్రతినిధి మాట్లాడుతూ..నిర్వాహకులు లాటరీ కథనాల్లో పాల్గొనకుండా.. ప్రచారం చేయకుండా వినియోగదారులకు లాటరీని ఒక సేవగా అందిస్తామని తెలిపారు.