డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ 69 ఏళ్ళ వయసులో పెళ్ళికి సిద్దమయ్యాడు. తన చిరకాల ప్రేయసి అయినటువంటి స్కై డైలీని పెళ్లి చేసుకుంటున్నట్లుగా ప్రకటించాడు.
కొన్ని సంవత్సారాల క్రితం ఉదయం లేవగానే టీవీలో డబ్ల్యూడబ్ల్యూఈ ఆట కనిపిస్తుంది. రియాలిటీకి అద్దం పడుతూ కొన్ని సంవత్సరాలు ఈ క్రీడా బాగా పాపులర్ అయింది. అయితే ఏమైందో తెలియదు గాని ఇదంతా ఒక అబద్ధం అనే ప్రచారం సాగింది. దీంతో డబ్ల్యూడబ్ల్యూఈని నిలిపేస్తున్నట్లుగా టాక్ వచ్చింది. ఈ సంగతి పక్కన పెడితే డబ్ల్యూడబ్ల్యూఈ లో కొంతమంది స్టార్లు ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించారు. కేన్, రాక్, అండర్ టేకర్, బిగ్ షో ఇలా వీరందరూ డబ్ల్యూడబ్ల్యూఈ లో ప్రత్యర్థి ఎవరైనా చిత్తు చేసేవారు. ఈ లిస్టులో హల్క్ హొగన్ కూడా ఉంటాడు. డబ్ల్యూడబ్ల్యూఈ ద్వారా ఎంతో పేరు సంపాందించిన ఈ స్టార్ వ్యక్తిగతంగా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా 69 ఏళ్ళ వయసులో మూడో పెళ్లి చేసుకుంటున్నట్లుగా ప్రకటించాడు.
హల్క్ హోగన్ 69 ఏళ్ళ వయసులో పెళ్ళికి సిద్దమయ్యాడు. తన చిరకాల ప్రేయసి అయినటువంటి స్కై డైలీని మరి కొన్ని రోజుల్లో వివాహం చేకోబోతున్నానని..అంతకంటే ముందు ఆమెను వివాహం చేకుంటున్నట్లుగా తెలిపాడు. స్కై డైలీ అకౌంటెంట్ గా పని చేస్తూ, యోగా ఇన్స్ట్రక్టర్ గా బిజీగా ఉంది. ఆమెకు గతంలో పెళ్లి కాగా ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఇక హల్క్ హొగన్ విషయానికి వస్తే అమెరికాలోని ఒక సాధారణ కుటుంభంలో జన్మించి డబ్ల్యూడబ్ల్యూఈలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఈ వీరుడు మొదటిసారిగా 1983లో లిండా క్లారిట్జ్ ని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో బేధాభిప్రాయాలు రావడంతో 2009 లో విడాకులిచ్చాడు. ఇక 2010 లో మెక్ డేనియల్ ని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.
11 ఏళ్ళ పాటు మెక్ డేనియల్ తో వివాహ బంధంకి ఇటీవలే బ్రేక్ పడింది. దీంతో హల్క్ స్కైడైలీతో గత కొంతకాలంగా రిలేషన్ లో ఉంటున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటివరకు రహశ్యంగా ఉంచినా.. తాజాగా తాను నిశ్చితార్ధం చేసుకున్నట్లుగా తెలిపాడు. స్కైడైలీ పిల్లలతో కూడా తాను ప్రేమలో ఉన్నట్లుగా వారిని తండ్రిలా చూసుకుంటున్నానని తెలిపాడు. ప్రొఫెషనల్ రెజ్లర్ గా రిటైరైన హల్క్ ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నాడు. సోషల్ మీడియాలో ఇతడికి 2 మిలియన్ల ఫాలోవర్లు ఉండడం విశేషం. ఈ సందర్భంగా స్కైడైలీతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే నా జీవితం, నా ఇష్టం, ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదని ట్రోల్లర్స్ కి తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. మొత్తానికి 69 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యంలో పడేసిన హల్క్ హోగన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.