దశాబ్దాల చరిత్ర కలిగిన విజయవాడ రైల్వే స్టేషన్ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోతుందా ? రైల్వేబోర్డు చేస్తున్న ప్రయత్నాలు విజయవాడ జంక్షన్ ఉసురుతీయబోతున్నాయా ? దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయడం ద్వారా ఆర్దిక వ్యవస్దను, తద్వారా స్దిరాస్ది రంగాన్ని పరుగులు తీయించాలన్న కేంద్రం ఆలోచనే ఇందుకు కారణమా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అదే జరిగితే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో రైల్వేస్టేషన్ ఎలా ఉండబోతోందో ఊహకు కూడా అందడం లేదు. 133 ఏళ్ల చరిత్ర గల విజయవాడ […]
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన ప్రియురాలు క్యారీ సైమండ్స్ ను పెళ్లాడారు. లండన్‌లోని రోమన్ క్యాథలిక్ వెస్ట్‌మినిస్టర్ క్యాథెడ్రల్ చర్చిలో నిరాడంబరంగా వధూవరుల కుటుంబ సభ్యులు, మిత్రులు అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. వెల్లడించాయి. గత 200 సంవత్సరాల్లో పదవిలో ఉండగా పెళ్లి చేసుకున్న మొదటి బ్రిటన్ ప్రధానమంత్రిగా బోరిస్ జాన్సన్ రికార్డుకెక్కడం విశేషం. వేసవిలో బంధుమిత్రులతో కలిసి వివాహ సంబరాలు ఘనంగా జరుపుకోనున్నారని పేర్కొన్నాయి. బోరిస్ జాన్సన్, క్యారీ సైమండ్స్ […]
కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, స్టార్ హోటళ్లతో కలిసి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్యాకేజీ ప్రకటనలు జారీ చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్లలో టీకా వేయడం జాతీయ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. కొన్ని ఆస్పత్రులు కొన్ని హోటల్స్‌తో డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. హోటల్స్‌కి వచ్చే అతిథులకు రహస్యంగా వ్యాక్సిన్లు వేస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ఇది చట్ట విరుద్ధం అని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం […]
బహామాస్‌లో నివసిస్తున్న ఓ ఉన్నత కుటుంబం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారి ప్రైవేట్ ఐలాండ్‌లో పనిచేస్తే ఏడాదికి 1,20,000 డాలర్లు (ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం రూ.88 లక్షలు) చెల్లిస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న జంటలకు బంపర్ ఆఫర్, ఈ ప్రైవేట్ దీవిలోని ఇంట్లో పనిచేస్తే ఏడాదికి రూ.88 లక్షలు సంపాదించవచ్చు. అంటే నెలకు సుమారు రూ.7.3 లక్షలు చేతికి అందుతాయి. అయితే, వీరు కేవలం పెళ్లయిన జంటకు మాత్రమే ఈ అవకాశం ఇస్తారు. జీతం […]