వెస్టిండీస్ తో 5 టీ 20 ల మ్యాచులో భాగంగా టీమిండియాకు 1-2 తేడాతో వెనుకపడిన సంగతి తెలిసిందే. సిరీస్ గెలవాలంటే మిగిలిన రెండు టీ 20 లు గెలిచి తీరాల్సిన పక్షంలో నేడు వర్షం అంతరాయం కలిగించే అవకాశం కనిపిస్తుంది.
వెస్టిండీస్ పర్యటన ముగించుకోనున్న టీమిండియా నేడు విండీస్ తో జరగబోయే నాలుగో టీ 20 కోసం సిద్ధమవుతుంది. అదేంటి మరో రెండు టీ 20మ్యాచులు విండీస్ జట్టుతో ఆడాలి కదా .. అనుకుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం 5 టీ 20 ల్లో మొదటి మూడు టీ 20 మ్యాచులకి వెస్టిండీస్ ఆతిధ్యమివ్వనుండగా.. చివరి రెండు టీ 20 లకు అమెరికాలో అమెరికాలో జరగనున్నాయి. కారణం పక్కన పెడితే టీమిండియాకు ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది. మొదటి రెండు టీ 20 మ్యాచులు ఓడిపోయిన భారత్.. మూడో టీ 20 లో గెలిచి సిరీస్ మీద ఆశలు ఇంకా సజీవంగా ఉంచుకుంది. సిరీస్ గెలవాలంటే మిగిలిన రెండు టీ 20 మ్యాచులు కూడా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భారత్ ఆశలు అడియాసలు అయ్యేలా కనిపిస్తున్నాయి.
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు విజయాలు అంత సింపుల్ గా దక్కడం లేదు. స్వదేశంలో గట్టి పోటీనిస్తూ భారత్ కి పెద్ద సవాలుగా మారింది. వన్డే సిరీస్ లో భాగంగా రెండో వన్డేలో అనూహ్యంగా టీమిండియాకు షాక్ ఇవ్వగా.. తమకు అచ్చి వచ్చిన టీ 20 ల్లో చెలరేగి ఆడుతుంది. తొలి రెండు టీ 20 ల్లో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి తమతో అంత సులువు కాదని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం మూడు టీ 20 లు జరగ్గా విండీస్ జట్టు 2-1 ఆధిక్యలో నిలిచింది. నేడు అమెరికాలోని ఫ్లోరిడాలో నాలుగో టీ 20 కి వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. ఒకవేళ వర్షం పడితే టీమిండియాకు సిరీస్ గెలిచే అవకాశమైతే ఉండదు. ఎందుకంటే మిగిలి ఉన్న ఒక్క టీ 20 గెలిచినా 2-2 తో సిరీస్ సమం చేయగలుగుతుంది కానీ సిరీస్ అయితే దక్కదు.
గతంలో టీమిండియా ఇక్కడ ఆడిన ఒక మ్యాచులో కూడా వర్షం వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో అభిమానులు ఈ రోజు కూడా వర్షం పడుతుందేమో అని ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ సమయంలో ఫ్లోరిడాలో మేఘావృతమై ఉంటుందని, చిరుజల్లులు పడొచ్చని వాతావరణ శాఖ చెప్తోంది. అయితే పూర్తిగా మ్యాచ్ రద్దయ్యే అవకాశం అయితే ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇరు జట్లు అమెరికా చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించేసాయి. ఇక ఇక్కడ టీమిండియా రికార్డ్ చూసుకుంటే 6 మ్యాచుల్లో 4 విజయాలు సాధించింది. ఒక మ్యాచులో ఓడిపోగా.. మరో మ్యాచ్ రద్దయింది. మరి ఈ రోజు ఏం జరుగుతుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.