గతేడాది కరోనా సృష్టించిన కల్లోలం అంతాఇంత కాదు. ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. పని దొరక్క, శుభకార్యాలుని లిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా ఈ ఏడాది కోవిడ్–19 వైరస్ సెకండ్ వేవ్ ఉధృతితో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటించింది. శ్రీసీతారాముల పెండ్లి తర్వాత లగ్గం పత్రికలు రాసుకొని, వచ్చే నెల ముహూర్తాల్లో పెళ్లిళ్లు పెట్టుకోవాలనుకున్న వారు తీవ్ర ఆలోచనలో పడ్డారు. కొంతమంది పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈసారి కూడా కష్టాలు తప్పవని ఫంక్షన్‌హాళ్లు, పెళ్లిళ్లకు సంబంధించిన క్యాటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. ఈ నెల 29 నుంచి జూలై 4 వరకు 30కి పైగా పెళ్లి ముహూర్తాలున్నాయి. గతేడాది పెళ్లిళ్ల సీజన్‌పై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. తొలుత లాక్‌డౌన్, అనంతరం అన్‌లాక్ తర్వాత వాణిజ్య, వ్యాపారాలు కొంత కుదుట పడ్డాయి. అందరూ తమ వృత్తుల్లో బీజీ అవుతుండగా మళ్లీ సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు,వధూవరుల కుటుంబీకులకు కరోనా బెంగ పట్టుకుంది. పెళ్లి ఎలా చేయాలి. ఎంత మందిని పిలవాలి. ఎంత మందికి భోజనాలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటే అందరూ వస్తారా అని ఇప్పటికే ఫంక్షన్‌హాళ్లు బుక్ చేసుకున్నవారు ఆందోళన చెందుతున్నారు.
వివాహ ముహూర్తాలు దగ్గరికి వచ్చిన నేపథ్యంలో ఆడ, మగ పెళ్లివారు కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారని ఎదురుచూస్తున్న వస్త్ర వ్యాపారులు కరోనా కరో నా కారణంగా గిరాకీ లేక ఖాళీగా కూర్చునే పరిస్థితి నెలకొంది. ఒక పెళ్లికి సుమారు రూ.లక్ష విలువైన వస్త్రాలు విక్రయించేవారు. కరోనా సెకండ్ వేవ్‌తో శుభకార్యాలు జరగకుంటే దుకాణాల అద్దె, వర్కర్లకు వేతనాలు ఎలా చెల్లించాలో అనే ఆందోళనలో క్యాటరింగ్, డెకరేషన్, సౌండ్ సిస్టమ్, లైటింగ్ నిర్వాహకులు, వస్త్ర వ్యాపారులు ఉన్నారు.