రంజాన్ అంటే ముస్లింలకు ఎంతో పవిత్రమైన పండుగ. నెల రోజుల పాటు ఉపవాసం ఉంటూ ఆఖరి రోజున నెలవంకను చూసి ఉపవాస దీక్షను ముగిస్తారు. ఆ తర్వాత రోజు రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఈ నెల రోజుల పాటు ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి. వాటిలో తప్పకుండా ట్రై చేయాల్సిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ మీకోసం తీసుకొచ్చాం.
ముస్లింలకు రంజాన్ పండుగ ఎంత పవిత్రమైందో.. ఎంత పవిత్రమైందో అందరికీ తెలుసు. నెలరోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. నెల ముగిసిన తర్వాత నెలపొడుపును చూసి తర్వాతి రోజు రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 24 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈ రంజాన్ నెల సమయంలో పగటిపూట పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోరు. చీకపటిపడిన తర్వాత చంద్రుడుని చూసి నమాజ్ చేసుకున్న తర్వాత మాత్రమే భోజనం చేస్తారు. అయితే ఈ నెలలో ముస్లింలు చాలా ప్రత్యేకమైన ఆహారాన్ను తీసుకుంటారు. ఎందుకంటే వారికి రోజు మొత్తం కావాల్సిన శక్తిని అందించాలి కాబట్టి.
రంజాన్ మాసంలో హైదరాబాద్ లాంటి నగరాల్లో రాత్రి మొత్తం ఫుడ్ దొరుకుతుంది. ఓల్డ్ సిటీలో అయితే మీకు నాన్ వెజ్ లో ఉండే అన్ని వెరైటీలు దొరుకుతాయి. సాధారణంగా హైదరాబాద్ లో ఎర్లీ మార్నింగ్ లభించే నాన్ వెజ్ ఫుడ్ కంటే రంజాన్ మాసంలో ఇంకా ఎక్కువ వెరైటీలు లభిస్తాయి. అయితే రంజాన్ నెలలో లభించే వెరైటీల్లో ఒక్క ముస్లింలు మాత్రమే కాకుండా.. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. హలీమ్, బిర్యానీ, పాయా, డబుల్ కా మీటా, కునాఫా, బేజా ఫ్రై, లుక్మీ, బైడా రోటీ, ఘోష్ పసిందే, కుబానీ కా మీటా, బోటీ కబాబ్ ఇలాంటి ఫుడ్స్ ని రంజాన్ మాసంలో ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. కాబట్టి మీ దగ్గర్లో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ లభిస్తుంటే మాత్రం ఓసారి మీరూ ట్రై చేయండి.