విరాట్ కోహ్లీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరకీ తెలుసు. ఒక క్రికెటర్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కానీ, అతని వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అతని పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒక సంఘటన నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన అందరూ కోహ్లీ హ్యాట్సాఫ్ అంటున్నారు.
విరాట్ కోహ్లీ– కింగ్ కోహ్లీ- రన్ మెషిన్.. ఎలా పిలిచినా మైదానంలో అడుగుపెడితే మాత్రం పరుగుల వరద పారాల్సిందే. ప్రపంచంలో ఉన్న మేటి క్రికెటర్లలో విరాట్ ఒకడు. ప్రస్తుతం ఐపీఎల్ లో దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. క్రికెటర్ గా విరాట్ కోహ్లీ ఎంత గొప్పవాడే అందరికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను బద్దలు కొట్టిన రికార్డులు చూస్తే తెలిసిపోతుంది. అయితే అతను వ్యక్తిత్వం పరంగా ఇంకా ఎంత గొప్పవాడో చెప్పే ఘటన ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళకు చెందిన ఓ షెఫ్ షేర్ చేసిన సంఘటన విన్నాక అందరూ హ్యాట్సాఫ్ కోహ్లీ అంటూ కామెంట్ చేస్తున్నారు.
కేరళకు చెందిన షెఫ్ పిళ్లై ఎంతో ఫేమస్. సెలబ్రిటీ షెఫ్ గా నెట్టింట బాగా పాపులర్ ఆయన. పిళ్లై పేరు వినగానే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ గుర్తు పట్టేస్తారు. 2018లో వెస్టిండీస్ తో సిరీస్ జరుగుతున్న సమయంలో కోహ్లీని కలిసిన సందర్భం గురించి పిళ్లై ఇటీవల పంచుకున్నారు. అసలు కోహ్లీ ఎలా ఉంటాడు? అతని వ్యక్తిత్వం ఎలాంటిది అనే విషయం ఈ ఘటన గురించి తెలుసుకుంటే అర్థమైపోతుంది. “2018లో నేను కేరళలోని రావిజ్ హోటల్ లో పనిచేస్తున్నాను. వెస్టిండీస్ తో మ్యాచ్ కోసం వచ్చిన టీమిండియా ఆ హోటల్ లో దిగింది. వారి కోసం మేం మంచి సముద్రపు చేపలు తీసుకొచ్చి మంచి వంటకాలు చేసి పెట్టాం” అంటూ పిళ్లై చెప్పుకొచ్చారు.
“టీమిండియా మొత్తంలో కోహ్లీ ఒక్కరే వెజిటేరియన్. ఆయన కోసం ప్రత్యేకంగా వంట చేయాల్సి వచ్చింది. వెజిటేరియన్ ఎలాంటి వెరైటీలు ఉంటాయని అడిగారు. నేను 24 రకాల వంటకాలతో తయారు చేసే ‘సాధ్య’ ట్రై చేయమని చెప్పాను. అందుకు కోహ్లీ కూడా ఓకే చెప్పారు. నిజానికి సాధ్య ఒక్కరి కోసం చేసే భోజనం కాదు. కానీ, కోహ్లీ కోసం ప్రత్యేకంగా అది చేసి పెట్టాం. మధ్యాహ్నం కోహ్లీ తిన్న తర్వాత కొన్ని వంటకాలు మిగిలిపోయాయి. వాటిని ఏం చేస్తారని అడిగారు. మా రూల్స్ ప్రకారం వాటిని పారేస్తామని చెప్పాం. అందుకు కోహ్లీ అంగీకరించలేదు. తనకు డిన్నర్ మిగిలిపోయిన వంటకాలనే వడ్డించాలంటూ కోరారు.
అందుకు హోటల్ స్టాఫ్ అనుమతి, బీసీసీఐ పర్మిషన్ కావాల్సి ఉంటుంది కాబట్టి కుదరదని చెప్పాం. కానీ, కోహ్లీ పట్టుబట్టారు. ఇంక తప్పక అదే భోజనాన్ని రాత్రికి వడ్డించాం. కోహ్లీలాంటి ఒక వ్యక్తి అలా మిగిలిపోయిన భోజనం చేయడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. తన వల్ల ఆహారం వృథా కాకూడదని కోహ్లీ చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేం” అంటూ షెఫ్ పిళ్లై చెప్పుకొచ్చారు. షెఫ్ చెప్పిన అప్పటి సంఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మధ్యాహ్నం మిగిలిన ఆహారం రాత్రికి తినడం అందరి ఇళ్లల్లో జరిగేదే. కానీ, కోరుకుంటే విరాట్ కోహ్లీ ప్రపంచంలో ఎంత ఖరీదైనా వంటకమైనా తినగలడు. ఎంత ప్రత్యేకమైన ఆహారాన్ని అయినా తినగలిగే స్తోమత కలిగిన వ్యక్తి. అలాంటిది విరాట్ కోహ్లీ ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని వృథా చేయకుండా తిన్నాడనే విషయం తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విరాట్ కోహ్లీ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.