పూర్వ కాలం నుంచి మనిషి సుదూర ప్రదేశాలకు వెళ్లెందుకు వివిధ రకాల వాహనాలు వాడేవారు. ప్రస్తుతం భూమిపై రైలు, బస్సు, ద్విచక్ర వాహనాలు ఉపయోగిస్తే.. ఆకాశ మార్గంలో విమానాలు, సముద్ర మార్గంలో లగ్జరీ ఓడలు అందుబాటులోకి వచ్చాయి.
సాధారణంగా బస్సు, కారు, టూవీలర్స్, రైలు, విమానాలు ఇలా ఎన్నో ప్రయాణ సాధనాలు మనకు అందుబాటు ఉంటున్నాయి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ప్రయాణ సదుపాయాలు కల రవాణా సాధనాలు ఆకాశం మార్గంలో అయితే విమానాలు, జల మార్గంలో అయితే నౌకలు. పూర్వ కాలం నుంచి నౌకా ప్రయాణాలు దేశ, విదేశ వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుటకు ఎంతగానో ఉపయోగపడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సముద్రంలోనే సకల సదుపాయాలతో ఎన్నో లగ్జరీ ఓడలు వస్తున్నాయి. అలాంటి ఓ లగ్జరీ ఓడ గురించి ఇపుడు మనం తెలుసుకుందాం. వివరాలలోకి వెళితే..
రష్యాకు చెందిన ఆండ్రీ గుర్యేవ్ ధనికుడు ఉన్నారు.. ఆయనకు ఆల్ఫానీరో అనే లగ్జరీ ఓడ ఉండేది. ఈ నౌక 267 అడుగుల పొడవు, 2500 టన్నుల బరువు కలది. ఇందులో జిమ్, స్పా సెంటర్, ఎలివేటర్, స్విమ్మింగ్ పూల్ మొదలైన సకల సదుపాయాలున్నాయి. దీని ధర 120 మిలియన్ డాలర్లు పలుకుతుంది. అంటే భారత కరెన్సీతో పోలిస్తే రూ.990 కోట్లకు పైనే ఉంటుందన్నమాట. కానీ లంగరు వేసుకుని ఆంటిగ్వా తీరంలోనే ఉండిపోయింది. అంత లగ్జరీ నౌక అలా లంగరు వేసుకొని తీరంలో ఉండటానికి కారణం ఏంటా అని చాలా మందికి అనుమానం వస్తుంది. అయితే దీని వెనుక ఓ పెద్ద కారణమే ఉందని ప్రచారం జరుగుతుంది.
2022 మార్చిలో ఈ నౌక ప్రయాణికులతో ఆంటిగ్వా తీరానికి చేరుకునేసరికి అదే సమయంలో రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ పై దండయాత్రకు పాల్పడ్డాయి. ఈ దండయాత్రను ఖండించిన పశ్చిమ దేశాలు రష్యాపై కొన్ని షరతులు విధించాయి. ఇందులో భాగంగా ‘ఆల్ఫా నీరో’ రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఆంక్షల నేపథ్యంలో ఈ ఓడ ఆంటిగ్వా అధికారికంగా స్వాధీనం చేసుకుంది. ఈ ఓడ ఎలాంటి రాకపోకలు లేకపోవడంతో ‘దెయ్యం ఓడ’ గా మారిపోయింది. ఈ ఆల్ఫా నీరో లగ్జరీ ఓడ నిర్వహణ బాధ్యత ఆంటిగ్వా మీద పడింది. దీనిలో చెక్క, లెదర్, హైడిజైన్ ఇంటీరియర్స్ ను కాపాడుకునేందుకు నిరంతరం జనరేటర్, ఏసీలు నడవవలసిందే. డోర్లు తెరుచుటకు కరెంట్, డీజిల్ వినియోగం కూడా తప్పనిసరి. అయితే ఓడను నిర్వహణ ఖర్చులు ఆంటిగ్వాకు తలకుమించిన భారంగా తయారైంది.
ప్రతి నెల 1,12,000 డాలర్లు అనగా భారత కరెన్సీలో దాదాపు రూ.92 లక్షలు ఖర్చవుతుందన్నమాట. దీని నిర్వహణలో భాగంగా సిబ్బందికి కూడా జీతాలు చెల్లించలేదని కోర్టులో దావా వేశారు. ఈ ఓడ తలకు మించిన భారం కావడంతో ఆంటిగ్వా ఇటీవల బిడ్డింగ్ చేపట్టింది. ఆంక్షలు ఎత్తివేస్తే ఓడను వేలం వేస్తామని ఆంటిగ్వా అమెరికాను కోరింది. దీనిపై అమెరికా నుండి ఎటువంటి స్పందన రాలేదు. ఈ నిర్వహణా భారమైన లగ్జరీ ఓడపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A Russian superyacht has been docked in Antigua for more than a year and the government desperately wants to sell it https://t.co/Xm0HRRDKVC
— Bloomberg Wealth (@wealth) May 19, 2023