బిగ్ బాస్ ప్రియాంక సింగ్ ట్రాన్స్ జెండర్ గా మారడం వెనకాల అసలు కథ ఇదే!

స్పెషల్ డెస్క్- బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రియాల్టీ షో అందరిని బాగానే అలరిస్తోంది. ఎపిసోడ్ ఎపిసోడ్ కు ఉత్కంఠ పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతుంటే.. మిగిలిన కంటెస్టెంట్స్ భలే రంజుగా ఆట ఆడుతున్నారు. అందులోను ప్రియాంక చాకచక్యంగా గేమ్ ఆడుతూ దూసుకుని పోతుంది. జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ప్రియాంక అలియాస్ సాయి తేజ తాను ట్రాన్స్ జెండర్‌గా మారడానికి ఎన్ని అవస్తలు పడిందో, ఎలాంటి అవమానాలు ఎదుర్కొందో తెలియజేస్తూ బిగ్ బాస్ హౌస్‌ లో ఎమోషనల్ అయ్యింది.

తాను సాయి తేజ నుంచి ప్రియాంక అలియాస్ పింకీ గా మారిన విషయం తన తండ్రికి తెలియదని చెప్పిన ప్రియాంకను ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా తండ్రి బిగ్ బాస్ హౌజ్ కు వచ్చి సర్ ప్రైజ్ చేశారు. కొడుకు అయినా కూతురు అయినా నువ్వే, నిన్ను చూస్తే మాకు గర్వంగా ఉందని తండ్రి చెప్పిన మాటాలకు ప్రియాంక ఆనందానికి అవధుల్లేవని చెప్పవచ్చు.

Priyanka Singh 1 1

ఈ మాట కోసం తాను ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్నానని, బిగ్ బాస్ హౌస్‌కి రావడం ద్వారా తన తండ్రి తనని అర్థం చేసుకున్నారంటూ భావోద్వేగానికి గురైంది పింకి. ఈ సందర్బంగా తాను సాయి తేజ నుంచి ప్రియాంకగా మారడం వెనుక గల కారణాలను చెప్పికొచ్చింది ఆమె. తాను ట్రాన్స్ జెండర్‌గా మారాలని అనుకున్నప్పుడు ఎవరి సలహా తీసుకోవాలో తెలియక, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సన్నిధికి వెళ్లి అక్కడ అమ్మవారు ఇచ్చిన నిర్ణయాన్ని బట్టే తాను ట్రాన్స్ జెండర్ గా మారానని చెప్పింది.

హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయానికి వెళ్లి కోర్కెలు కోరుకుంటే నెరవేరుతాయనే భక్తుల్లో నమ్మకం ఉంది. ముఖ్యంగా అక్కడ అమ్మవారి సన్నిధిలో రూపాయి కాయిన్‌ ని నిలబెట్టి మనసులో కోరిక కోరుకుంటారు. ఆ కాయిన్ పడిపోతే ఆ కోరిక నెరవేరదని, ఒకవేళ కాయిన్ నిలబడే ఉంటే తప్పకుండా కోరిక నెరవేరుతుందని బలంగా నమ్ముతుంటారు.

ఇదిగో ప్రియాంక కూడా తాను ట్రాన్స్ జెండర్‌గా మారాలని అనుకున్నప్పుడు పెద్దమ్మతల్లి దేవాలయానికి వెళ్లి, రూపాయి కాయిన్‌ని నిలబెట్టి తన మనసులో కోరిక అమ్మవారితో చెప్పుకుందంట. అయితే ఆ రూపాయి కాయిన్ పడిపోకుండా నిలబడే ఉండటంతో అమ్మవారి అనుగ్రహం లభించిందని సంతోషపడిందట. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ముంబై వెళ్లి ఆపరేషన్ చేయించుకుని ట్రాన్స్ జెండర్‌గా మారానని చెప్పుకొచ్చింది ప్రియాంక అలియాస్ పింక్.