యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. సోషల్ మీడియాలో విశేషమైన ఫాలోయింగ్ కలిగిన షణ్ముఖ్.. బిగ్ బాస్ తర్వాత పెద్దగా వార్తల్లో కనిపించలేదు. బిగ్ బాస్ లో అడుగు పెట్టినప్పుడే మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న షన్ను.. కప్పు కొట్టేస్తాడని అందరూ భావించారు. కానీ చివరికి రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. అయినా సోషల్ మీడియాలో షన్నుకు ఫ్యాన్స్ సపోర్ట్ ఏమాత్రం తగ్గలేదు. ఇక బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దీప్తి, షణ్ముక్ విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి షన్నూ పూర్తిగా తన కెరీర్‌పై ఫోకస్ పెట్టాడు. వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం లవ్ ఫెయిల్యూర్ గురించి షన్నూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
ప్రస్తుతం తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌లో షన్ను టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్‌ను శుక్రవారం నాడు విడుదల చేశారు. జూలై 22న మొదటి రెండు ఎపిసోడ్‌లు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో షన్ను తాజాగా ఈ సిరీస్ ప్రమోషన్ పనులతో బిజీగా ఉన్నాడు.ఈ క్రమంలో ఓ చానెల్‌తో షన్ను మాట్లాడుతూ.. వెబ్ సిరీస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ సినిమాలో కూడా లవ్ ట్రాక్ ఉంటుందని.. కానీ తన గత సిరీస్‌ల మాదిరి ఇందులో బ్రేకప్ ఉండదని చెప్పుకొచ్చాడు. ఇన తన కెరీర్‌లో తీసిన చాలా వెబ్ సిరీస్‌లలో బ్రేకప్ కామన్ అయ్యిందని.. ఇక తన జీవితంలో బ్రేకప్ స్టోరీలు ఉండవని చెప్పుకొచ్చాడు షన్ను. ఇది చూసిన నెటిజనులు.. దీప్తిని దృష్టిలో పెట్టుకునే షన్నూ ఈ వ్యాఖ్యలు చేశాడని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.