జిహ్వకో రుచి..పుర్రెకో బుద్ధి అన్నారు..ఎవరి పిచ్చివారికానందం ..అలాగే ఉంది..బంగారు కారు కథ!బంగారం ఎంతో విలువైనది అని అందరికీ తెలుసున్నవిషయమే!ప్రపంచం మొత్తంలో ఆభరణాల తయారీలో దీని వాడకం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల ద్వారా తెలుస్తోంది.అయితే కొందరు ప్రముఖ వ్యాపార వేత్తలు,సినీ ప్రముఖులు సరికొత్త రీతిలో వారి ప్రత్యేకత చూపించుకోవటం కోసం కొన్నిరికార్డులు కైవసం చేసుకోవటానికి కొత్తదనంతో కొత్త దారులు పట్టటం సహజం!ఒకరు రత్నాలు పొదిగిన దుస్తులు ధరిస్తే ..మరొకరు ఏకంగా బంగారు వస్త్రాలతో వార్తలకెక్కుతుంటారు.
ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా వార్తలలోకి వస్తుంటారు.ఇప్పుడు తాజాగా నేటి ప్రముఖ మాధ్యమాల్లో ఒక ట్రెండ్ సృష్టించిన వార్త నేటి కథాంశం గా మారింది.ఓ వ్యక్తి బంగారు పూత పూసిన కారులో తిరిగే దృశ్యం..అదొక సంచలన వార్తలా జనం చూడటం..ఆనందించటం..మెచ్చుకోవటం పై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తీవ్రంగా స్పందించారు.ప్రజలకి ఒక మంచి సందేశాన్నికూడా ఇచ్చారు.డబ్బులు వృథాగా ఎలా ఖర్చు చేయకూడదో వివరిస్తూ ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.ఇంతకీ విషయానికి వస్తే ఆయన అలా ఎందుకు స్పందించారో పూర్తి వివరాలు చూద్దాం!
అమెరికాలో భారత సంతతికి చెందిన ఒకాయన తన ఫెరారీ కారేసుకొని వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ వైరల్‌గా మారింది. ఆ కారు ప్రత్యేకత ఏమిటని ఆరా తీస్తే.. అది పూర్తిగా బంగారు పూత పూసిన కారని వీడియో ద్వారా తెలుస్తోంది. ఓ ఇద్దరు వ్యక్తులు దాంట్లో కూర్చుని వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. దాన్ని చూసి చుట్టుపక్కల వారంతా ఆశ్యర్యపోతూ ఫొటోలు తీసుకుంటున్నారు.ఈ వీడియోపైన ‘ఇండియన్ అమెరికన్ విత్ ప్యూర్ గోల్డ్ ఫెరారీ కార్’ అని నోట్ రాసి ఉంది.
అది చూసి ఆనంద్ మహీంద్రా తన ట్విటర్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారు.డబ్బు చాలా విలువైనదని దానిని ఎలా ఖర్చు పెట్టకూడదో ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చని అన్నారు.ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఎందుకు ఇంతలా చక్కర్లు కొడుతుందో అర్ధం కావటం లేదని ఆశ్చర్యపోయారు. మీరు ధనవంతులు కావచ్చు.ధనవంతులమైనంత మాత్రాన డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదో దీని ద్వారా మనం పాఠం నేర్చుకోవాలని ఆయన సూచించారు.అంతకు మించి ఇందులో ఏమీ లేదు, ఏ విధంగా ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిందో?’’ అని ఆయన ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
ఈ పోస్టును 24 గంటల్లో 1,69,300 మంది వీక్షించారు. వీరిలో 6,000 మంది లైక్ చేశారు. ఇంతకీ ఆయన ఉద్దేశ్యం డబ్బు చాలా విలువైనది ..అనవసరంగా విలాసాలకోసం వృధాగా వినియోగించటం మంచిది కాదన్నది ఆయన అభిప్రాయం! ఆనంద్ మహీంద్రా కూడా బంగారు కారులో షికారు చేయగల సమర్ధుడు..అయినప్పటికీ డబ్బు విలువ తెలియచేయటమే ఆయనిచ్చిన సందేశం !