సాయితేజ్‌ను కాపాడిన వ్యక్తి ఫర్హాన్‌కి ‘మెగా’ నజరానాలు??! ఎంతవరకూ నిజం?

Farhan, the man who saved Saitej - Suman TV

మెగా హీరో సాయ్‌ ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం.,  ఆస్పత్రికి తరలించడం కూడా వెనువెంటనే జరిగిపోయాయి.. ఆయనకు సరైన సమయంలో ట్రీట్‌మెంట్‌ అందడం వల్లే ప్రాణాపాయం తప్పింది అంటున్నారు   బైక్ ప్రమాదానికి గురైన సినీ హీరో సాయిధరమ్ తేజ్‌ను కాపాడిన యువకుడు మహ్మద్ ఫర్హాన్‌ను అందరూ అభినందిస్తున్నారు. ఫర్హాన్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి.   ఫర్హాన్‌కు మెగా ఫ్యామిలీ  ఎన్నో కానుకలను ఇచ్చిందనీ,కారు కూడా ఇచ్చిందనీ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై ఫర్హాన్ స్పందించాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించాడు.

Jr NTR PRO Explain about Sai Tej Accident - Suman TVతనకు ఎవరూ ఎలాంటి బహుమతులు, డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశాడు. మెగా ఫ్యామిలీ నుంచి తనకు ఎవరూ ఫోన్ కాల్ చేయలేదని మహ్మద్ ఫర్హాన్ చెప్పాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పాడు. ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించానే తప్ప, తాను ఏమీ ఆశించలేదని ఫర్హాన్ తెలిపాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో తన కుటుంబం ఇబ్బందులు పడుతోందని, దయచేసి అలాంటి వార్తలు పోస్ట్ చేయొద్దని కోరాడు.

అతను మీడియాతో మాట్లాడిన వీడియో మీకోసం