వైద్యం కోసం వచ్చే ఓ పేషెంట్ తో ఎఫైర్ పెట్టుకుంది ఓ నర్సు. ఏకంగా ఆసుపత్రిలోనే అతడితో శృంగారంలో పాల్గొన్నది. ఆ తరువాత ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆసుపత్రి వర్గాలు షాక్ కు గరుయ్యాయి.
వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు. డాక్టర్లు దైవంతో సమానం. ఆనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే రోగులను అక్కున చేర్చుకుని వారి జబ్బులను నయం చేసి పేషెంట్ లకు ప్రాణం పోస్తారు వైద్యులు. అందుచేత వైద్యులను దైవ సమానులుగా పేర్కొంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న వైద్య వృత్తికి కొందరు డాక్టర్లు, ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులు వారి దురుసు ప్రవర్తన వల్ల, వెకిలి చేష్టల వల్లఅప్రతిష్టపాలవుతున్నారు. ఇదే అంశానికి సంబందించి ఓ ఆసుపత్రిలో పనిచేసే నర్స్ అదే హాస్పిటల్ కు చికిత్స కోసం వచ్చే పేషెంట్ తో ఎఫైర్ పెట్టుకుంది. హాస్పిటల్ ప్రాంగణంలోనే అతడితో శృంగారంలో పాల్గొంది. ఆ తరువాత ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దీంతో ఆ నర్సు, ఆసుపత్రి సిబ్బంది షాక్ కు గురయ్యారు. అసలు ఏం జరిగిందంటే..
ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యుల సూచనల మేరకు పేషెంట్ లకు చికిత్స అందిస్తుంటారు నర్సులు. పేషెంట్ కు సమయానికి మెడిసిన్స్, ఇంజక్షన్స్ ఇస్తూ నర్సులు సహాయపడుతుంటారు. ఈ క్రమంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి డయాలసిస్ చేయించుకోవడం కోసం ఆసుపత్రికి రాగా అక్కడే పనిచేస్తున్న నర్సు అతడితో ఎఫైర్ పెట్టుకుంది. కొద్ది రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతుంది. కాగా ఓ రోజు హాస్పిటల్ ప్రాంగణంలోనే నర్సు అతడితో శృంగారం చేస్తుంగా అతడు మృతి చెందాడు. దీంతో ఆమెను విధుల్లోంచి తొలగించారు ఆసుపత్రి వర్గాలు. ఈ ఘటన యునైటెడ్ కింగ్ డామ్ లోని వేల్స్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
వేల్స్ లోని ఓ హాస్పిటల్ లో 42 ఏళ్ల వయసున్న పెనెలోప్ విలియమ్స్ నర్సుగా విధులు నిర్వహిస్తుంది. అదే హాస్పిటల్ కు డయాలసిస్ చికిత్స కోసం ఓ పేషెంట్ వస్తుండేవాడు. ఈ క్రమంలో ఆ నర్సు అతడితో ఎఫైర్ పెట్టుకుంది. ఆసుపత్రి ప్రాంగణంలోనే కారులో అతడితో శృంగారంలో పాల్గొంది. ఆ సమయంలో ఆ పేషెంట్ మరణించాడు. విషయం ఆసుపత్రి వర్గాలకు తెలిసింది. దీనిపై విచారణ జరిపిన యాజమాన్యం ఆ నర్సు వల్ల ఆసుపత్రికి చెడ్డపేరు వస్తుందని భావించి విధుల్లోంచి తొలగించారు. కాగా శృంగార సమయంలో ఆ పేషెంట్ కార్డియాక్ అరెస్టు తో మృతి చెందినట్లు డాక్టర్లు చెబుతున్నారు. దీనికి సబంధించిన కథనాన్ని యూకే టైమ్స్ తన నివేధికలో పేర్కొంది. ఈ ఘటనపై నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కౌన్సిల్ కమిటీ సమగ్ర విచారణ చేయనుంది.