‘బిగ్ బాస్’ షో పట్ల అభ్యంతరాలు!.. నెగిటివ్ పబ్లిసిటీ వల్లే టీఆర్పీ రేటింగ్సా!?.

బిగ్‌బాస్’ రియాలిటీ షో తెలుగు సీజన్ ఫైవ్ ఇటీవల ప్రారంభమైన సంగతి అందరికీ విదితమే. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ‘బిగ్‌బాస్’  షోకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బోలెడు మంది అభిమానులున్నారు. అయితే, ఈ షో వల్ల జనాలకు కలిగే ఉపయోగమేంటి? అని కొంతమంది మేధావుల ప్రశ్న. లేటెస్ట్ గా ప్రసారమైన ఎపిసోడ్ లో విశ్వ  ఎంచుకున్న ఇద్దరి ఇంటి సభ్యుల ఒంటిపై ఉన్న దుస్తులతో సహా అన్ని వస్తువులన్నింటిని స్టోర్‌ రూమ్‌లో పెట్టాలని ‘బిగ్‌బాస్’ చెప్పాడు. దీంతో యాంకర్‌ రవి – ప్రియ లను ఎంచుకున్నాడు విశ్వ. వారిద్దరి దుస్తులలతో పాటు అన్ని వస్తువులు లాక్కెళ్లిపోవడంతో రవి, ప్రియ వెరైటీ డ్రెస్సుల్లో కనిపించారు. యాంకర్‌ రవి లేడీస్‌ డ్రెస్‌ ధరించగా, ప్రియ అబ్బాయి డ్రెస్‌లో కనిపించి షాకిచ్చింది. ఇక అమ్మాయి డ్రెస్‌లో ఉన్న రవిని ఎత్తుకొని సందడి చేశాడు విశ్వ.

Bigg Boss 02 min

‘బిగ్‌బాస్’ రియాలిటీ షో లో ఇచ్చే టాస్కుల ద్వారా కంటెస్టెంట్స్‌లో అభద్రతాభావం ఏర్పడి వారు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండటం మనం చూడొచ్చు. కంటెస్టెంట్స్ డైలాగ్స్ కూడా సొల్లులా అనిపిస్తున్నాయనే కామెంట్స్ వినబడుతున్నాయి. అయితే, ఇవేవీ పట్టించుకోకుండా కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసం షో రన్ అవుతున్నదనే వాదన కూడా వినబడుతోంది. నిజానికి ప్రోగ్రాం ప్రొడ్యూసర్స్ ఈ షోను ప్లాన్ చేసింది టీఆర్పీ రేటింగ్స్ కోసమే అనేది నిర్వివాదాంశం.  ఈ షోను ఎక్కువ సేపు చూస్తే జనాలు ఇబ్బందుల పాలవుతారనే వాదన వినబడుతోంది. గతంలో సీపీఐ సీనియర్ నేత నారాయణ ‘షో’ పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి అందరికీ విదితమే.

టీవీ మందు గంటల తరబడి కూర్చొనడం వల్ల ఎటువంటి విజ్ఞానం లభించకపోగా, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పిచ్చి పిచ్చి చేష్టలు చూడాల్సి వస్తుందనే అభిప్రాయం వినబడుతోంది. ఇకపోతే ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ ఓవర్ యాక్షన్స్, ఏదేని విషయమై రియాక్షన్స్ ద్వారా మానవ సంబంధాలపై ప్రభావం ఉంటుందని మానసిక నిపుణులు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ షో ను ఇంటి నుంచి తరిమేయాల్సిన అవసరముందని కొందరు అభిప్రాయపడు తున్నారు. 2017, 1 జూలై 16న ప్రారంభమై 70 రోజులపైగా నడిచింది. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొన్నారు. క్రమేణా అందులోని పార్టిసిపెంట్సూ, అక్కడ ఉండేరోజులూ పెరుగుతూ జనాదరణ పొందడం మనం చూస్తునేఉన్నాం. ఈ నేపధ్యంలో మళ్ళీ అభ్యంతరాలు కూడా చోటు చేసుకోవడం, టీఆర్పీకోసం నెగిటివ్ పబ్లిసిటీ స్టంట్ అనుకోవడం మామూలే కదా!.