బిగ్ బాస్ 6వ సీజన్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. షో పూర్తి కావడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలుంది. ఫినాలేకు సంబంధించి ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ విన్నర్ ఎవరనేదానిపై చాలా చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలోనే అదే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంకొందరైతే కాస్త ముందుకెళ్లి.. విజేతకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే విజేతగా నిలిచిన వ్యక్తి కాకుండా ఆ తర్వాత ఎవరెవరు […]
బిగ్ బాస్ 6వ సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే 14 వారాలు గడిచిపోయాయి. తాజాగా ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా ఇనయ ఎలిమినేట్ అయిపోయింది. ప్రస్తుతం హౌసులో ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఇక ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున స్పష్టం చేశాడు. దీంతో టాప్-5 ఎవరెవరు ఉండబోతున్నారా అనే టెన్షన్ అందరిలో ఉంది. ఇలాంటి టైంలో హౌసులో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ ఎమోషనల్ చేస్తున్నాడు. […]
ఈసారి బిగ్ బాస్ లో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్స్ ఎవరూ లేరు. ఉన్నదల్లా గీతూ, రేవంత్ లాంటి వారు మాత్రమే. వీరిలో గీతూని గత వారం ఎలిమినేట్ చేసేశారు. సాధారణంగా బిగ్ బాస్ గెలిచినా, ఎలిమినేట్ అయినా సరే ఇంటర్వ్యూలు, పార్టీలు అని తెగ హడావుడి చేస్తారు. కానీ గీతూ మాత్రం చాలా సైలెంట్ గా ఉండిపోయింది. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని తెగ మాట్లాడుకున్నారు. కానీ ఆమె ఇంకా ఎలిమినేషన్ బాధ నుంచి బయటకొచ్చినట్లు కనిపించట్లేదు. ఎందుకంటే […]
బిగ్ బాస్ షో అంటే ఎంటర్ టైన్ మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో.. ట్విస్టులు కూడా అలానే ఉంటాయి. హౌసులో పలానా కంటెస్టెంట్ స్ట్రాంగ్ గా ఉన్నాడు, భలే ఆడుతున్నాడు అనుకుంటాం. అతడు/ఆమె ఆ వెంటనే ఎలిమినేట్ అయిపోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే అది బిగ్ బాస్ కాబట్టి. అంతెందుకు గత వారం.. ఆర్జే సూర్య ఎలిమినేట్ అనగానే హౌసులో ఉన్న కంటెస్టెంట్స్ తోపాటు చూస్తున్న ప్రేక్షకులు కూడా చాలామంది షాకయ్యారు. టాప్-5లో ఉంటాడనుకున్న […]
బిగ్ బాస్ తెలుగు షో జరగడం ఏమో కానీ ఎప్పటికప్పుడు వివాదాలు చెలరేగుతూన ఉంటాయి. ప్రస్తుతం ఆరో సీజన్ లో 52 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఇక సీజన్ ప్రారంభంలోనే సీపీఐ నారాయణ బిగ్ బాస్ షోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అశ్లీలతని ప్రోత్సాహిస్తున్నారని.. ఓ పరుష పదజాలం ఉపయోగించి మరీ హోస్ట్ నాగార్జునని తిట్టిపోశారు. నిర్వహకులు మాత్రం అవేం పట్టించుకున్నట్లు కనిపించలేదు. నాగ్ మాత్రం బిగ్ బాస్ హౌసులోని మెరీనా-రోహిత్ కి హగ్ చేసుకోమని చెప్పాడు. మీకు […]
బిగ్ బాస్ 6వ సీజన్ కాస్త వెరైటీగా అనిపిస్తోంది. ఎందుకంటే హౌస్ మేట్స్ లో చాలామంది ఆడటం కంటే ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లు కనిపిస్తున్నారు. హౌస్ట్ నాగార్జున కూడా అలాంటి వాళ్లపై సీరియస్ అయ్యేసరికి రూట్ మార్చారు. దానికి తోడు హౌసులో ఎప్పుడు పరిస్థితులు ఎలా మారతాయి? ఏం జరుగుతుందనేది అంచనా వేయడం చాలా కష్టం. మరి ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో ప్రేక్షకుల అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది మరోలా ఉంటుంది. బిగ్ బాస్ ఆరో సీజన్ […]
బిగ్ బాస్ 6 సీజన్ చూసే ఎవరికైనా సరే ఎవరు ఆడుతున్నారో ఎవరు ఆడినట్లు నటిస్తున్నారో తెలిసిపోతుంది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి హౌస్ లోకి వచ్చిన వారిలో చాలామంది ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. దానికి తోడు తొలి రెండు వారాల్లో ఎపిసోడ్స్ కూడా ఏమంత ఆసక్తిగా జరగలేదు. దీంతో రేటింగ్స్ కూడా తగ్గిపోయాయి. ఫలితంగా తాజాగా పూర్తయిన వీకెండ్ హౌసులో హీట్ పెంచింది. హోస్ట్ నాగార్జున అయితే ఒక్కొక్కరిని నిలబెట్టి మరీ కౌంటర్స్ వేశాడు. ఇందులో […]
బిగ్ బాస్ షో ప్రారంభమవడం ఏమోగానీ, CPI నేత నారాయణ సీనులోకి ఎంటర్ అవుతారు. ఆ షోపై షాకింగ్ కామెంట్స్ చేస్తారు. ఇది గత కొద్ది సీజన్ల నుంచి జరుగుతూ ఉన్నదే. కాకపోతే నారాయణ వ్యాఖ్యలపై షోకి సంబంధించిన వారు ఎవరు స్పందించేవారు కాదు. కానీ ఈసారి మాత్రం హోస్ట్ నాగార్జున- నారాయణ మధ్య పరోక్షంగా మాటల యుద్ధం జరిగింది. ముందు ముందు జరిగేలా కనిపిస్తోంది. అదంతా పక్కనబెడితే దీనిపై ఇప్పుడు నాగ్ కాస్త వివరణ ఇచ్చేంత […]
‘బిగ్ బాస్’ షోలో వారం మొత్తం ఎపిసోడ్స్ ఎలా ఉన్నాసరే వీకెండ్ మాత్రం ఫుల్ మస్తీ. ఎందుకంటే మిగతా రోజులు రెగ్యులర్ డ్రస్సులో కనిపించే హౌస్ మేట్స్ అందరూ.. శని-ఆదివారం బిందాస్ గా రెడీ అవుతారు. ప్రేక్షకులకు కూడా గ్లామర్ విందు ఇస్తారు. ఈసారి కూడా అందులో అస్సలు తీసిపోలేదు. ఇప్పటికే శనివారం ఎపిసోడ్ కాస్త ఫన్, మరికాస్త సీరియస్ గా సాగింది. ఆదివారం ఎపిసోడ్ మాత్రం దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ […]
‘బిగ్ బాస్’లో వారమంతా ఎలా ఉన్నా సరే.. వీకెండ్ ఎపిసోడ్ వస్తే మాత్రం సందడి వేరే లెవల్. హోస్ట్ నాగార్జున వచ్చేస్తాడు. పార్టిసిపెంట్స్ లో ఎవరికీ ఇవ్వాల్సింది వాళ్లకు ఇచ్చేస్తాడు. ఒక్కొక్కరినీ నిలబెట్టి మరీ ఆడేసుకుంటాడు. ఆ విషయంలో ఏ మాత్రం మొహమాటపడడు. ప్రస్తుతం ఆరో సీజన్ తొలివారం వీకెండ్ ఎపిసోడ్ లో స్టైలిష్ గా కనిపించిన నాగ్.. హౌస్ లో ఉన్నవాళ్లకే కాదు బయటనుంచి ఈ షోపై విమర్శలు చేసిన ఓ వ్యక్తికి స్ట్రాంగ్ కౌంటర్స్ […]