కోడిగుడ్డు వల్ల నాని 'దసరా' మూవీ కొత్త చిక్కులు వచ్చాయి. ఏకంగా కొందరు ఈ విషయమై నిరసన తెలిపేవరకు వెళ్లిపోయారు. డైరెక్టర్ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది?
నాని కొత్త సినిమా ‘దసరా’కు అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. రిలీజైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్న ఈ మూవీ.. 5 రోజుల్లోనే రూ.92 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. దర్శకుడు, నిర్మాతతోపాటు సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇలా అంతా సంతోషంగా ఉన్న టైంలో ఓ విషయం మాత్రం ‘దసరా’కి కొత్త కష్టాలు తీసుకొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటా సంగతి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. గోదావరిఖని బొగ్గుగనుల నేపథ్యంగా వీర్లపల్లి అనే ఊరిలో జరిగే స్టోరీ ‘దసరా’. ఇందులో నాని హీరోగా నటించగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా చేసింది. మూవీలో యాక్షన్, ఎమోషన్, డ్రామా.. కొన్ని కొన్ని మినహా చాలావరకు అన్ని వర్కౌట్ అయ్యాయి. మాస్ ఆడియెన్స్ సినిమా చూసి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఓ విషయం మాత్రం పలువురు అంగన్వాడీ క్యార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసింది. ఈ విషయమై వాళ్లు ఏకంగా సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
‘దసరా’లో కీర్తి సురేష్, వెన్నెల అనే అంగన్వాడీ టీచర్ పాత్ర చేసింది. అయితే ఓ సీన్ లో భాగంగా గుడ్లు, పప్పు లాంటివి దొంగతనం చేస్తూ కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే సీన్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆదిలాబాద్ కు చెందిన పలువురు అంగన్వాడీ కార్యకర్తలు.. రీసెంట్ గా ‘దసరా’ ప్రదర్శిస్తున్న థియేటర్ల ముందు బైఠాయించారు. తమ నిరసన తెలిపారు. ఆ సీన్ తొలగించాలని సెన్సార్ లేఖ రాయడమే కాదు.. డైరెక్టర్ సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. నిస్వార్థంగా సేవలందిస్తున్న తమని ఇలా అవమానపరచడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ‘దసరా’ టీమ్ ఈ ఇష్యూపై స్పందించినట్లు లేదు. ఇది చివరకు ఏమవుతుందనేది చూడాలి? కోడిగుడ్డు వల్ల ‘దసరా’ చిక్కుల్లో పడటం అనేదానిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Dharani continues to rule the Box Office 💥#Dasara grosses 92+ CRORES WORLDWIDE IN 5 DAYS 🔥
Watch #Dasara in cinemas today 💥
– https://t.co/9H7Xp8jaoG#DhoomDhaamBlockbuster@NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/3KJ9eMiTfr— SLV Cinemas (@SLVCinemasOffl) April 4, 2023