ఆమె తెలుగు హీరోయిన్. కాకపోతే ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ స్టార్ అయిపోయింది. తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా లేదా?
సాధారణంగా హీరోయిన్లు అనగానే సినిమాల్లో నటిస్తారు. రెమ్యునరేషన్ తీసుకుంటారు. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో హీట్ పెంచుతూ ఉంటారు. కొందరు ముద్దుగుమ్మలు మాత్రం యాక్టింగ్ తో పాటు గొడవల్లోనూ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారుతూ ఉంటారు. తెలుగులో ఇలా కొందరు హీరోయిన్లు ఉన్నారు. కావాలనే కాంట్రవర్సీలు చేస్తారో లేదా అలా జరుగుతుందో తెలియదు గానీ వీళ్లపై పోలీసు కేసులు కూడా నమోదవుతూ ఉంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ అలానే వివాదంలో చిక్కుకుంది. అదే టైంలో ఆమె చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి తెలుగులో సినిమాలు చేసి ప్రస్తుతం బాలీవుడ్ లో జెండా పాతేసిన తాప్సీది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. పుట్టి పెరిగింది అంతా దిల్లీలోనే. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు తీసిన ‘ఝుమ్మంది నాదం’తో హీరోయిన్ గా మారింది. అలా తెలుగులో ప్రభాస్, రవితేజ, గోపీచంద్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు బాలీవుడ్ లోకి వెళ్లిపోయిన ఈ బ్యూటీ.. కమర్షియల్ చిత్రాలతో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ చాలా ఫేమ్ తెచ్చుకుంది. చివరగా గతేడాది వచ్చిన ‘మిసన్ ఇంపాజిబుల్’ అనే తెలుగు సినిమాలో నటించింది.
అయితే తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ.. ఆ తర్వాత కొన్నాళ్లకు బాలీవుడ్ లోని ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మన సినిమాలపైనే కామెంట్ చేసింది. దీంతో అప్పుడు ఆ విషయం కాస్త వివాదంగా మారింది. ఆ తర్వాత కూడా చాలా విషయాల్లో తాప్సీ వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కింది. తాజాగా లక్ష్మీదేవి బొమ్మ ఉన్న నెక్లెస్ ధరించడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈమెపై హిందు సంఘాలు కేసు కూడా పెట్టాయి. ఇలా నిత్యం వార్తల్లో ఉండే తాప్సీ చిన్నప్పటి పిక్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి ఈ బ్యూటీ చైల్డ్ హుడ్ పిక్ చూసి మీలో ఎవరైనా గుర్తుపట్టారా? కింద కామెంట్ చేయండి.