స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ఆమెపై నెటిజన్స్‌తో పాటు అభిమానులు కూడా సీరియస్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే..!
తెలుగులో తక్కువ కాలంలో స్టార్డమ్ సంపాదించిన హీరోయిన్గా రష్మిక మందన్నను చెప్పొచ్చు. ఈ అమ్మడు ఒక్కో సినిమాతో తెలుగు నాట భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక ‘పుష్ప’ చిత్రంతో ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది. ఓవర్‌నైట్ నేషనల్ వైడ్ పాపులారిటీ రావడంతో హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఆమె స్టార్‌డమ్‌ను పలు బ్రాండ్ కంపెనీలు తమ ప్రమోషన్స్ కోసం వినియోగించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ జపాన్ ఫ్యాషన్ బ్రాండ్‌కు రష్మిక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. అలాగే ఒక ఫుడ్ ఐటెం కోసం కూడా ఆమె కమర్షియల్ యాడ్ చేసింది. టాప్ బర్గర్ బ్రాండ్ యాడ్‌లో యాక్ట్ చేసిన రష్మిక.. స్పైసీ బర్గర్‌ను రుచి చూస్తూ ఎంజాయ్ చేస్తోంది.
రష్మిక తాను నటించిన బర్గర్ యాడ్‌కు సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే గతంలో తాను ఓ శాకాహారిని అంటూ రష్మిక పలు ఇంటర్వ్యూల్లో స్వయంగా తెలిపింది. అలాంటి రష్మిక ఇప్పుడు చికెన్ బర్గర్‌ను తింటూ యాడ్ చేయడంతో ఆమె మీద నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. ఒక మాట అనేసి దాన్ని ఎలా తప్పుతారంటూ రష్మికను ఫ్యాన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న క్రష్మిక.. ఈ కాంట్రవర్సీపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్లో రణ్‌బీర్ కపూర్ సరసన ‘యానిమల్’ అనే ఫిల్మ్‌లో నటిస్తోంది. ఈ మూవీని సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నారు. ‘యానిమల్’తో పాటు ‘పుష్ప-2’లోనూ రష్మిక నటిస్తోంది. అలాగే నితిన్‌తో ఒక సినిమా చేస్తోంది.
Rashmika Mandanna is seen eating a chicken burger in the latest McDonald’s ad. Public asks – isn’t she vegetarian? Plant based?#RashmikaMandanna #nonveg #meatlover #Vegan #veg #Bollywood #MacDonald #Hypocrisy #chicken #junkfood #plantbased pic.twitter.com/9NmVOCqIZ2
— Garima Kumar (@BollywoodGK) April 28, 2023