దివ్య దేవరాజన్ – ది లేడీ డైనమిక్ ఆఫీసర్…

తాను ఎన్ని కష్టాల్లో ఉన్నా ఇతరుల కష్టాన్ని తెలుసుకొని, తీర్చి, వారి కళ్ళల్లో సంతోషాన్ని చూసేవాడు అసలు సిసలు నాయకుడు. అలా ఓ నాయకురాలు ఒక ఊరి కష్టాలను తెలుసుకుని తీర్చి ఎంతో మంది జీవితాలను కాపాడింది. దానికి బదులుగా ఆమె పేరు నే మా ఊరి పేరు గా పెట్టుకున్నారు అక్కడ ప్రజలు. ఏదైనా వ్యక్తపరచడానికి భాష ముఖ్యం అని ఆమె కి అర్థమైంది. మూడు నెలల వ్యవధిలో పట్టువదలకుండా ప్రయత్నించి గొండి భాషలో ప్రావీణ్యం సంపాదించింది. దివ్య దేవరాజన్. వయసు 37ఏళ్లు. 2020లో ఐఏఎస్ పాస్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌. మహిళలపై నేరాలు జరక్కుండా నిరోధించడం ఆమె ప్రథమ లక్ష్యం. అన్యాయం జరిగిన బాధితులకు న్యాయం జరిగేలా చూడటం రెండో లక్ష్యం. దివ్య దేవరాజన్ డైనమిక్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు. ఏ లక్ష్యంతో అయితే వస్తారో దాన్ని నెరవేర్చకుండా నిద్రపోరు. ఇందుకు నిలువెత్తు నిదర్శనమే ఐఏఎస్ అధికారిణి దివ్య దేవరాజన్. ప్రత్యేక గిరిజన కోఆర్డినేటర్లను ప్రభుత్వ ఆస్పత్రిలో భాష అనువాదకులను నియమించి దగ్గరి నుండి పరిపాలన కార్యాలయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడం, భాషను స్వయంగా నేర్చుకోవడం వరకు దివ్య దేవరాజన్ ఊరి ప్రజలకు చేరువై వారి కష్టాన్ని తెలుసుకోవడం వరకు వెళ్లడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు.

Collector Divya Devarajan

ఐఏఎస్ అధికారిణి దివ్య దేవరాజన్ ముందు ఓ మిషన్(లక్ష్యం) ఉంది. మహిళలపై జరిగే నేరాలను అరికట్టడం, బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చూడటం, మహిళా సాధికారత. ఇవీ దివ్య దేవరాజన్ ముందున్న లక్ష్యాలు. ప్రస్తుతం వాటి సాధన దిశగా ఆమె ప్రయాణం సాగుతోంది.  ఇటీవలే ఆదిలాబాద్ వాసులు దివ్య చేసిన పనులకి కృతజ్ఞతతో తమ జిల్లాలోని ఒక ఊరికి దివ్య గూడా అని పేరు పెట్టారు. నిరక్షరాస్యత, నిరుద్యోగం, పారిశుద్ధ్య నీటిపారుదల అనారోగ్య సమస్యలు మరియు వరదలు ఇలాంటి ఎన్నో సమస్యలను అధిగమించడానికి ఎంతో కృషి చేసారు.