ఒళ్లు పై మరిచి మద్యం సేవిస్తూ, రోడ్డుపై తూగుతూ.. అక్కడే పడిపోతుంటారు. ఇంట్లో కుటుంబ సభ్యులను మర్చిపోయి.. వచ్చిన జీతమంతా బార్లకు తగుల బెడుతుంటారు. ఇక రాత్రి, పగలు అని తేడాలేకుండా మత్తులో జోగుతుంటారు. ఇలా మద్యం సేవించడమే కాకుండా.
‘నువ్వు సారా తాగుట మానురన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావురన్న, నీవు బీరు తాగుట మానురన్నో లేకుంటే బాల్చి తన్నేస్తావురన్నో, అరే బ్రాందీ, విస్కీ, రమ్ ఏ బ్రాండు తాగినా.. జబ్బు పడి నీ ఒళ్లు గబ్బౌతాది’ అని జాని సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ పాట పాడతారు. అది నిజంగా నిజం. ఒళ్లు పై మరిచి మద్యం సేవిస్తూ, రోడ్డుపై తూగుతూ.. అక్కడే పడిపోతుంటారు. ఇంట్లో కుటుంబ సభ్యులను మర్చిపోయి.. వచ్చిన జీతమంతా బార్లకు తగుల బెడుతుంటారు. ఇక రాత్రి, పగలు అని తేడాలేకుండా మత్తులో జోగుతుంటారు. ఇలా మద్యం సేవించడమే కాకుండా.. తాగి ఆఫీసుకు వెళ్లిన ఉద్యోగి.. ఉద్యోగం ఊస్టింగ్ అయిపోయింది. ఈ ఘటన తెలంగాణ వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.
అతడి ప్రభుత్వ ఉద్యోగి. మొదటి తారీఖునే ఠంచనుగా జీతం తీసుకుంటాడు. ప్రజల సమస్యలు వింటూ పరిష్కరించే వృత్తిలో ఉన్నాడు. కానీ మద్యానికి బానిసై.. ఆఫీసుకు కూడా తాగి వచ్చి.. మిగిలిన ఉద్యోగులను ఇబ్బందికి గురి చేస్తున్నాడు. అతడి విషయం తెలిసిన కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి.. అతడి ఉద్యోగాన్ని ఊడపీకేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలోని ఎస్సీ అభివృద్ధి కార్యాలయంలో సేవ్యా నాయక్ ఏఏస్‌డబ్ల్యూవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అతడు మద్యానికి బానిసై పగటి పూట కూడా తాగి వస్తున్నాడు. తోటి సిబ్బందికి ఇబ్బంది కలిగిస్తున్నాడు. చివరకు ఆయన థంబ్ కూడా పడటం లేదు. ఈ విషయం కలెక్టర్ వద్దకు చేరింది.
రోజులాగే తాగి వచ్చిన విధులకు హాజరయ్యాడు సేవ్యా నాయక్. ఈ విషయం తెలిసిన కలెక్టర్ తేజస్ నందలాల్.. సేవ్యానాయక్ విధులు నిర్వర్తిస్తున్న కార్యాలయానికి నేరుగా వెళ్లారు. అతడితో మాట్లాడాడు. మద్యం తాగి ఆఫీసుకు వచ్చినట్లు గుర్తించిన కలెక్టర్.. గ్రామీణ పోలీసులను పిలిపించి బ్రీత్ అనలైజర్‌తో టెస్టులు చేయించారు. మద్యం తాగినట్లు పరీక్షల్లో తేలడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నందలాల్.. వెంటనే అతడిని విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.