విజయం అందరికి ఊరికే రాదు. ఎంతో శ్రద్ధ, క్రమశిక్షణతో సాధించుకోవాలి. చాలా కొద్దిమందికి సులువుగా సక్సెస్ అందుతుంది. మరికొందరికి ఎంత కష్టపడినా సక్సెస్ రాదు. తొలి ప్రయత్నంలో ఫెయిల్ అయి.. కలెక్టర్ స్థాయికి చేరుకున్న యువకుని సక్సెస్ స్టోరీ చూద్దాం.
ప్రస్తుతం సమాజంలో ప్రభుత్వ ఉద్యోగాలకు చాలా కాంపిటీషన్ ఉంది. నోటిఫికేషన్ పడింది మొదలు లక్షల్లో అప్లికేషన్స్ చేరతాయి. సర్కార్ కొలువు సాధించుటకు రాత్రింబవళ్లు కష్టపడి చదువుతారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితం సెటిల్ అయినట్లుగా భావిస్తారు. UPSC నిర్వహించే సివిల్స్ పరీక్షల్లో సెలెక్ట్ కావాలంటే తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది. తెలంగాణకు చెందిన దురిశెట్టి అనుదీప్ సివిల్స్ పరీక్షలో నేషనల్ లెవెల్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అనుదీప్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఆదర్శం. ఆయన సక్సెస్ జర్నీ ఎలా సాగిందో చూద్దాం..
అనుదీప్ ఒకటికాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యాడు. చివరకు తన లక్ష్యాన్ని సాధించుకున్నాడు. రెండో ప్రయత్నంలో ఐ.ఆర్.ఎస్ కు సెలెక్ట్ అయ్యాడు. అంతకు ముందు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కూడా పని చేశాడు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటూనే ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. సివిల్స్‌పై దృష్టి సారించాడు.ఐ.ఆర్.ఎస్ కు సెలెక్ట్ అయినా కూడా అనుదీప్‌కు ఐఏఎస్ పైనే మనసు ఉండేదని ఆయన వెల్లడించారు. 2012లో ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యాడు. కాని మెయిన్స్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యానని చెప్పుకొచ్చాడు.
2017లో ఇదే నాచివరి అవకాశం అనుకుని ఎగ్జామ్ రాశానన్నాడు. ముందు చేసిన తప్పులు సరిచేసుకుని రిపీట్ కాకుండా చూసుకున్నాను. కొన్ని విషయాల్లో కీలక మార్పులు చేసుకుని.. శాస్త్రీయ పద్ధతిలో కష్టపడితే సక్సెస్ సాధించవచ్చని అనుదీప్ తెలిపారు. ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన అనుదీప్.. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాకు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంపిటీషన్ పరీక్షలు రాసే చాలామందికి ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. సక్సెస్ ఎవరికి ఈజీగా రాదు.. కష్టపడి సాధించుకోవలసిందేనని, సక్సెస్‌కు అడ్డదారులు ఉండవు కష్టపడాలి అని తెలిపారు. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.