ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ గా తప్పుకున్న చైనీస్‌ మొబైల్‌ కంపెనీ! రంగంలోకి టాటా!

TATA IPL 2022

ఐపీఎల్‌’ అంటే కేవలం భారతదేశంలోనే కాదు.. యావత్‌ క్రికెట్‌ ప్రపంచంలో మంచి క్రేజ్‌ ఉంది. ఇప్పటికే 14 సీజన్లను సక్సెస్‌ ఫుల్‌ గా పూర్తి చేసుకుని 15వ సీజన్‌ ను కూడా లాంఛనంగా ప్రారంభించనుంది. ఇప్పటివరకు అందరికీ తెలిసిన పేరు ‘VIVO ఐపీఎల్‌’. కానీ, వచ్చే ఏడాది నుంచి ఆ పేరు మారనుంది. వచ్చే సీజన్‌ ‘TATA IPL- 2022’ కాబోతోంది అని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ వెల్లడించారు. టైటిల్‌ స్పాన్సర్‌ గా చైనీస్‌ మొబైల్‌ కంపెనీ వివో స్థానంలో టాటా కంపెనీ రానున్నట్లు తెలియజేశారు.

వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ కు టాటా కంపెనీ టైటిల్‌ స్పాన్సర్‌ గా వ్యవహరించనుంది. వివో కంపెనీకి ఇంకా రెండేళ్ల కాంట్రాక్టు ఉంది. ఈ రెండేళ్లలో టాటా కంపెనీ మెయిన్‌ స్పాన్సర్‌ గా వ్యవహరించనున్నట్లు బ్రిజేష్‌ పటేల్‌ తెలియజేశారు. ఇప్పటికే ఐపీఎల్‌-2022 కోసం అన్ని ఏర్పాట్లను చకాచకా పూర్తి చేస్తున్నారు. మెగా వేలానికి కూడా రంగం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు వేలానికి రెడీ అయిపోయాయి. ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా మెగా ఆక్షన్‌ నిర్వహించనున్నారు. ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ మార్పు నిర్ణయం సరైందేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.