స్మార్ట్ ఫోన్ అనగానే అందరూ 5జీ ఫోన్లనే కొనుగోలు చేస్తున్నారు. అందుకే చాలా కంపెనీలు ఇప్పుడు 5జీ ఫోన్లనే తయారు చేస్తున్నాయి. గతంలో అయితే 5జీ ఫోన్ ధరలు బాగా ఎక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు వాటి ధరలు బాగా దిగొచ్చాయి. వివో కంపెనీ నుంచి మార్కెట్ లోకి తాజాగా ఒక బడ్జెట్ 5జీ ఫోన్ రిలీజ్ అయ్యింది.
ప్రస్తుతం మార్కెట్ లో 5జీ హవా నడుస్తోంది. ఎవరు స్మార్ట్ ఫోన్ కొన్నా కూడా అది 5జీ ఫోన్ అయిఉండాలని భావిస్తున్నారు. కొన్ని నెలల క్రితం అయితే 5జీ ఫోన్లు బాగా ఖరీదుగా ఉండేవి. కానీ, ఇప్పుడు పోటీ పెరగడంతో ధరలు కూడా అమాంతం దిగొచ్చాయి. చాలా కంపెనీలు తక్కువ ధరలకే 5జీ స్మార్ట్ ఫోన్లను అందిస్తన్నాయి. ఇప్పుడు వివో నుంచి కూడా ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. అదికూడా ఒక స్టన్నింగ్ లుక్స్, అదిరిపోయే ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 11న భారత మార్కెట్ లోకి ఈ మోడల్ ని వివో ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు తెలుసుకుని టెక్ నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
వివో కంపెనీకి భారత్ లో మంచి మార్కెట్ ఉండేది. కానీ, గత కొంతకాలంలో మాత్రం ఇతర కంపెనీల నుంచి పోటీ పెరిగి వివోకి కాస్త డిమాండ్ తగ్గిందనే చెప్పాలి. వివో అనగానే అందరూ కెమెరా ఫోన్ అంటారు. ఇప్పుడు 5జీ ఫోన్లు వచ్చిన తర్వాత వీళ్లు ఫీచర్ల విషయంలో కూడా శ్రద్ధ పెట్టారు. మంచి 5జీ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలోనే రిలీజ్ చెసి వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ఈ ఫోన్ ఏప్రిల్ 18 నుంచి ఫ్లిప్ కార్ట్, వివో కంపెనీ అదికారిక వెబ్ సైట్లలో సేల్ కి వస్తుంది. దీని ధర విషయానికి వస్తే.. రూ.17,499 నుంచి ధర ప్రారంభమవుతుందని వెల్లడించారు. వేరియంట్ ని బట్టి ఆ ధర మారుతుంది. పైగా దీనికి బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంకుల కార్డులు కలిగిన వారికి రూ.1,500 ఇన్ స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుందని తెలిపారు. 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకునే సౌకర్యం కూడా ఉంది.
ఈ వివో టీ2 ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్(రూ.17,499), 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్(19,499) వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తోంది. వెలాసిటీ వేవ్, నైట్రో బ్లేజ్ కలర్ ఆప్షన్స్ లో ఈ వివో టీ2 ఫోన్ లభించనుంది. ఇందులో ఫుల్ హెచ్ డీ ప్లస్ ఆమోలెడ్ డిస్ ప్లే, 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 360 హెట్స్ హై టచ్ శాంపిలింగ్ రేట్, స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్, 64 ఎంపీ ఓఐఎస్ యాంటీ షేక్ కెమెరా, 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ తో వస్తోంది. ఇందులో ఎక్స్ టెండెడ్ రామ్ ఆప్షన్ ఉంది. 8జీబీ ఎక్స్ టెండెడ్ ర్యామ్ 27 యాప్స్ ని ఒకేసారి రన్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో ఫ్రీ బ్యాక్ కేస్, ఫ్రీ స్క్రీన్ గార్డ్ కూడా లభిస్తున్నాయి. ఇది ఏప్రిల్ 18 నుంచి సేల్ కి రానుంది.
Now live your #TurboLife with the all-new vivo T2 5G Series.
Sale starts on 18th April 2023. Know more : https://t.co/Wx4Bvkpulx#GetSetTurbo #vivoT2Series #5G pic.twitter.com/J3J7tjpjEl
— vivo India (@Vivo_India) April 11, 2023