మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి ముగింపు పలికి.. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాం. ఈ క్రమంలో 2022లో ఏయే మొబైల్స్ లాంచ్ అయ్యాయి. అందులో వినియోగదారుల మనసు గెలుచుకున్న మొబైల్స్ ఏవి? తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ల ఏవన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐక్యూ, రియల్‌మీ, రెడ్‌మీ, సామ్‌సంగ్, మోటో, పోకో.. లాంటి బ్రాండ్స్ నుంచి 15 వేల లోపు ధరతో మంచి స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులో కలవు. వాటి వివరాలు..
ఈ ఏడాదిలో లాంచ్ అయిన బడ్జెట్ ఫోన్లలో ‘ఐక్యూ జెడ్6 లైట్‘ బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. 6.58 ఇంచెస్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ టెక్నాలజీ.. ఇలా దాదాపు ప్రీమియం రేంజ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు అందించింది. అంతేకాదు.. ఈ స్మార్ట్ ఫోన్ పని తీరు కూడా సూపర్బ్ అని కొనుగోలు చేసిన వారి అభిప్రాయం. ఇది రూ. 19,000 ధరతో లాంచ్ అయినప్పటికీ.. ప్రస్తుతం రూ.15,499 ధరకు అందుబాటులో ఉంది. కొనుగులు సమయంలో కార్డు ఆఫర్ల ద్వారా ఇంకా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
దేశంలో 5జీ పరుగులు పెడుతోంది. ఈ తరుణంలో 5గ్ మొబైల్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ‘ఐక్యూ జెడ్6 లైట్’ లాగానే ‘రియల్‌మీ 9ఐ‘ మార్కెట్ లో తన హవా చూపెట్టింది. 6.6 ఇంచెస్ ఎల్సిడీ డిస్‌ప్లే, 50 ఎంపీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీ.. వంటి ప్రీమియం ఫీచర్స్ వినియోదారులను బాగానే ఆకట్టుకున్నాయి. బడ్జెట్ ఫోన్లలో రియల్‌మీ 9ఐ టాప్ 5లో ఒకటిగా నిలిచింది. ఇది రూ.18,000 ధరతో లాంచ్ అయినప్పటికీ.. ప్రస్తుతం రూ.14,940 ధరకు అందుబాటులో ఉంది. కొనుగులు సమయంలో కార్డు ఆఫర్ల ద్వారా ఇంకా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
చైనా దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివోకు ఇండియాలో ఆదరణ ఎక్కువ. ఎక్కువమంది ఈ బ్రాండ్ ను ఇష్టపడుతుంటారు. వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా కంపెనీ కూడా కలర్ చేంజ్ మొబైల్స్, ఎక్కువ కెమెరా క్లారిటీ అందించే మొబైల్స్ లాంచ్ చేస్తూ ఉంటుంది. వివో ఇటీవల లాంచ్ చేసిన వై22 బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఎందుకంటే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్ ఇది. రూ.14,499 ధరకు అందుబాటులో ఉంది. కొనుగులు సమయంలో కార్డు ఆఫర్ల ద్వారా ఇంకా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ఎన్ని కంపెనీలు అడుగుపెట్టినా.. శాంసంగ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఒక్కసారి ఈ బ్రాండ్ కు అట్ట్రాక్ట్ అయినవారు.. వేరే కంపెనీ స్మార్ట్ పెద్దగా ఇష్టపడరు. 5G ప్రేమికుల కోసం స్మసాన్గ్ ఈ ఫోన్ లాంచ్ చేసింది. రూ. 25,000 ధరతో లాంచ్ అయిన ఈ మొబైల్.. ప్రస్తుతం రూ. 15,999 ధరకు అందుబాటులో ఉంది. కార్డు ఆఫర్ల ద్వారా ఇంకా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
అన్ని కంపెనీల కంటే తక్కువ ధరలో ‘5జీ స్మార్ట్‌ఫోన్’ లాంచ్ చేస్తామని ప్రకటించిన ‘పోకో’ కంపెనీ.. తక్కువ బడ్జెట్ లో పోకో ఎం4 5జీ సిరీస్ లాంచ్ చేసింది. 4జీబీ ర్యామ్ + 64జీబీ వేరియంట్ రూ.12,999 ధరకు అందుబాటులో ఉంది. చౌకైన 5G ఫోన్ ఇదే. పనితీరు పరంగా సూపర్బ్ అంటున్నారు. తక్కువ ధరలో 5జీ ఫోన్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
ఈ ఏడాది లాంచ్ అయిన బెస్ట్ బడ్జెట్ ఫోన్లలో ‘మోటో జీ42’ స్థానం దక్కించుకుంది. దీర్ఘకాలం మన్నిక రావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. ఇదొక ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పాలి. డిస్ ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్.. ఇలా అన్ని హంగుల్లో అద్భుతమైన ఫీచర్లు అందించింది. ఇది రూ. 14,790 ధరకు అందుబాటులో ఉంది. కార్డు ఆఫర్ల ద్వారా ఇంకా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.