స్మార్ట్ ఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాకపోతే స్మార్ట్ ఫోన్ కొనాలి అంటే కొంతమందికి భారంగా మారచ్చు. అయితే అలాంటి వారికోసం మార్కెట్ లో దొరుకుతున్న బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ వివరాలు తీసుకొచ్చాం.
ప్రస్తుతం అంతా స్మార్ట్ ఫోన్ లకు అడిక్ట్ అయిపోతున్నారు. అది లేకుపోతే రోజు గడవదు, ముద్ద దిగదు అనే పరిస్థితికి వచ్చేశారు. అయితే చాలామంది ఈ స్మార్ట్ ఫోన్ ని టైమ్ పాస్ కి వాడుతున్నారు. కానీ, కొందరు మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ ఆధారంగానే ఉపాధి పొందుతున్నారు. అయితే అందుకు మరీ ఎక్కువ బడ్జెట్ లో ఫోన్లు కొనలేని పరిస్థితి ఉండచ్చు. ఒకవేళ అంతపెట్టి ఫోన్ కొన్నా కూడా వారి వాడకానికి అది వెంటనే రిపేర్ రావచ్చు. అందుకే అలాంటి వాళ్లు తక్కువ ధరలో ఫోన్ కొనాలి అనుకుంటారు. అలాంటి వారి కోసం రూ.10 వేలలోపు లభిస్తున్న స్మార్ట్ ఫోన్స్ తీసుకొచ్చాం. మరి.. మీరూ ఓ లుక్కేయండి.
రెడ్ మీ 9A:
ఈ ఫోన్ కి ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలో ఉన్న రేటింగ్స్ చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఎంత బాగా సేల్ అవుతుందో చెప్పడానికి. ఈ ఫోన్ కి 3.17 లక్షలకు పైగా రివ్యూలు ఉన్నాయి. దీని ధర రూ.7,999 కాగా 19 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.6,499కే అందిస్తున్నారు. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 2 జీబీ ర్యామ్+ 32 జీబీ స్టోరేజ్, 2 గిగాహెట్స్ ఆక్టా కోర్ హీలియో జీ25 ప్రాసెసర్ ఉన్నాయి. 13 ఎంపీ రేర్ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ రెడ్ మీ 9A ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రెడ్ మీ 10A:
రెడ్ మీ 10ఏ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్, 2 గిగాహెట్స్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 13+ 5 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన ఎమ్మార్పీ రూ.11,999 కాగా 29 శాతం డిస్కౌంట్ తో రూ.8,499కే అందిస్తున్నారు. ఈ రెడ్ మీ 10ఏ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రెడ్ మీ A1:
రెడ్ మీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ రూ.10 వేలలోపు కేటగిరీలో ఉంది. ఈ రెడ్ మీ ఏ1 మోడల్.. 2 జీబీ ర్యామ్+ 32 జీబీ స్టోరేజ్, లెథర్ టెక్స్చర్ డిజైన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 12 వంటి ఫీచర్లతో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.8,999 కాగా 36 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.5,799కే అందిస్తున్నారు. ఈ రెడ్ మీ ఏ1 ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
టెక్నో స్పార్క్ 9:
ఈ టెక్నో స్పార్క్ 9 స్మార్ట్ ఫోన్ 4 జీపీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో ర్యామ్ ని 7జీబీ వరకు పెంచుకోవచ్చు. హీలియో జీ37 గేమింగ్ ప్రాసెసర్ తో ఈ ఫోన్ వస్తోంది. 13+ 8 ఎంపీ కెమెరాలతో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.11,499 కాగా 30 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.7,999కే అందిస్తున్నారు. ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నోకియా సీ01:
నోకియా కంపెనీ నుంచి కూడా రూ.10 వేలలోపు రేంజ్ లో ఓ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్+ 32 జీబీ స్టోరేజ్, 5+ 2ఎంపీ కెమెరా, ఫ్రంట్ ఫ్లాష్ తో ఫోన్ వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.7,999కాగా 31 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.5,499కే అందిస్తున్నారు. ఈ నోకియా ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రియల్ మీ నార్జో 50i:
ఈ రియల్ మీ నార్జో 50ఐ మోడల్ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8+ 5 ఎంపీ కెమెరాలతో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.9,999 కాగా 22 శాతం డిస్కౌంట్ తో రూ.7,799కే లభిస్తోంది. ఈ రియల్ మీ నార్జో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రెడ్ మీ 10:
రెడ్ మీ కంపెనీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ రెడ్ మీ 10 మోడల్ 4 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 50 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.14,999 కాగా 35 శాతం డిస్కౌంట్ తో రూ.9,747కే అందిస్తున్నారు. ఈ రెడ్ మీ 10 ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లావా ఎక్స్3:
లావా కంపెనీ నుంచి ఎక్స్3 అనే బడ్జెట్ ఫోన్ అందుబాటులో ఉంది. దీనిలో 6.5 ఇంచెస్ డిస్ ప్లే, 3 జీబీ ర్యామ్+ 32 జీబీ స్టోరేజ్, 8 ఎంపీ డ్యూయల్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.8,999కాగా 30 శాతం డిస్కౌంట్ తో రూ.6,299కే అందిస్తున్నారు. ఈ లావా ఎక్స్3 ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వివో వై02:
వివో కంపెనీ నుంచి ఓ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. దీనిలో 3 జీబీ ర్యామ్+ 32 జీబీ స్టోరేజ్, 8ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.12,999కాగా 31 శాతం డిస్కౌంట్ తో రూ.8,999కే అందిస్తున్నారు. ఈ వివో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.