చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘వివో‘ బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. వై సిరీస్ కింద ‘వివో వైఓ2’ పేరుతో తీసుకొచ్చిన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను రూ. 8,999గా నిర్ణయించింది. 6.51 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, ఐ ప్రొటెక్షన్ మోడ్, ఆండ్రాయిడ్ 12, మీడియా టెక్ చిప్‌సెట్, 5000 mAh బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో జోడించింది. ఇందులో స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. రియల్‌మీ సి-సిరీస్, రెడ్‌మీ నంబర్ సిరీస్, పోకో సి సిరీస్ ఫోన్లకు ఇది గట్టి పోటీ అని చెప్పొచ్చు.
ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను అందించారు. వాటర్ డ్రాప్ స్టైల్ కటౌట్ లో ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ చిప్‌సెట్‌ను అందించారు. ఇది మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉంది. 3 జీబీ ర్యామ్+ 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఒక్క వేరియంట్ మాత్రమే తీసుకొచ్చారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫేస్ బ్యూటీ, టైమ్ ల్యాప్స్ ఫొటోగ్రఫీ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W వైర్డ్ చార్జింగ్, 5W రివర్స్ చార్జింగ్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆర్చిడ్ బ్లూ, కాస్మిక్ గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. వివో ఇండియా ఇ-స్టోర్, ఇతర భాగస్వామ్య రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.
Keep up as a new trend emerges! Presenting the new #vivoY02 in 2 new colours.
Buy Now : https://t.co/eDzazkRLla#itsmystyle #buynow pic.twitter.com/2TUbehfQ5x
— vivo India (@Vivo_India) December 5, 2022
#VivoY02 Launched in Indonesia
– 6.51-inch HD+ LCD Display
– MediaTek Helio P22 SoC
– Android 12 (Go Edition) With Funtouch OS 12
– 8MP Rear Camera
– 5MP Front Camera
– 3.5mm Audio Jack, FM Radio
– 8.49mm Thickness
– 186g Weight
– 5,000mAh Battery With 10W Charging pic.twitter.com/FnktEQYldO— Tech Master (@Tech_Master18) November 29, 2022