పన్ను ఎగవేతదారులను అరికట్టేందుకు ప్రభుత్వం పలు రకాల చర్యలు తీసుకుంటోంది. పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై ప్రత్యేక నిఘా పెడుతోంది. అందుకోసం తాజాగా ఆదాయపు పన్ను శాఖలో పలు మార్పులు కూడా చేపట్టింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలు లేదా అంతకుమించి అకౌంట్ల నుంచి నగదు విత్ డ్రా లేదా డిపాజిట్ చేసే వారికి సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ రూల్స్ ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు సీబీడీటీ నోటిఫికేషన్ జారీ చేసింది.
నూతన రూల్స్ ప్రకారం ఇక నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తం బ్యాంకు లేదా తపాలాఫీసులో నగదు డిపాజిట్ చేస్తే ఆధార్, పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. ఆదాయం పన్ను చట్టం (15వ సవరణ) నిబంధనలు-2022 కింద కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఖరారు చేసింది. 2022 మే 26వ తేదీ నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి రానున్నాయి. నగదు లావాదేవీల వాడకాన్ని తగ్గించేందుకు, డిజిటల్ విధానాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీడీటీ ద్వారా ఈ నిబంధనలను తీసుకొచ్చింది అని చెప్తున్నా.. పన్ను ఎగవేతదారులను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు తీసుకొచ్చింది అన్నది అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే పలుమార్లు ఆధార్- పాన్ అనుసంధానించడానికి గడువు ఇచ్చిన కేంద్రం..మరోసారి ఆ గడువును పొడిగించింది. అయితే.. మార్చి 31, 2021 నుంచి మొదటి మూడు నెలల్లోపు అయితే.. 500 యుపాయలు, మూడు నెలల తరువాత అయితే.. 1000 రూపాయల పెనాల్టీ రూపంలో చెల్లించాలి.
ఏయే లావాదేవీలకు పాన్‌కార్డు, ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుందంటే..
- ఒక ఆర్థిక సంవత్సరంలో ఏదేనీ బ్యాంక్/ సహకార బ్యాంక్/ పోస్టాఫీసుల్లో.. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో రూ.20 లక్షలు/ అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసినా/ విత్ డ్రా చేసినా..
- ఏదేనీ బ్యాంక్/ సహకార బ్యాంక్/ పోస్టాఫీసుల్లో కరెంటు ఖాతా లేదా క్యాష్ క్రెడిట్ ఖాతా తెరిస్తే..
- ఎవరైనా కరెంటు ఖాతా తెరవడానికి పాన్ కార్డు సమర్పించాలి. అదే సమయంలో బ్యాంక్ ఖాతాలు గల వారు ఇప్పటికే పాన్‌కార్డు అనుసంధానించినా.. లావాదేవీల సమయంలో మరోసారి తప్పనిసరి పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది.
- మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.