ఏ కారణం లేకుండానే బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ చేస్తున్నాయి కొన్ని బ్యాంకులు. అయితే వాటి వివరాలను తెలుసుకునేందుకు బ్యాంకు సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది. దేనికి సంబంధించి డబ్బులు కట్ అవుతున్నాయో తెలుసుకోవాలి.
ప్రతి వ్యక్తి తన ఆదాయం నుండి ఎంతో కొంత పొదుపు చేసుకుంటాడు. ముందుచూపుగా దాచుకునే ప్రయత్నంలో ఆ డబ్బులను బ్యాంకుల్లో దాచుకుంటారు. బ్యాంకుల ద్వారా వచ్చే బెనిఫిట్స్ కూడా ఖాతాదారులకు అందుతాయి. బ్యాంకులో ఏదైనా కస్టమర్ల నుండి కలెక్ట్ చేయాలన్నా.. వారికి సంబంధించి బెనిఫిట్స్ ఇవ్వాలన్నా దానికి సంబంధించిన సమాచారం వారికి అందజేయాలి. ఎటువంటి సమాచారం లేకుండా డబ్బులు కట్ చేయకూడదు. అయితే ఈ మధ్య కస్టమర్ల ఖాతాల నుండి డబ్బులు కట్ చేస్తున్న ఉదాహరణలు ఎక్కువయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుండి జారీ అయిన ఇన్స్యూరెన్స్ పథకాలకు సంబంధించి ఖాతాదారుల అకౌంట్ల నుంచి కట్ చేస్తుంటాయి. అదికాకుండా ఇతర కారణాలతో డబ్బులు కట్ చేస్తే తప్పకుండా కస్టమర్లకు తెలియపరచాలి. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ మధ్యకాలంలో బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ చేస్తున్నారన్న వార్తలు తరచు వింటున్నాం. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన’(PMSBY), ‘ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన’పథకాలు తెలిసినవే. ఈ పాలసీల్లో ఖాతా ఉన్నవారు రెండు పథకాలకు కలిపి రూ.456 ప్రతీ సంవత్సరం చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్స్ లో గతంలో ఎన్‌రోల్ చేసుకున్నవారికి అకౌంట్ల నుండి బ్యాంకులు ఆటో డెబిట్ ఆప్షన్ ద్వారా ప్రీమియం డబ్బులు మాత్రమే కట్ చేస్తుంటాయి.
అయితే తాము ఏ స్కీమ్ లో లేకపోయినప్పటికి డబ్బులు మాయం అవుతున్నాయని కస్టమర్లు కంప్లైంట్ చేస్తున్నారు. ఇలాంటి కటింగ్స్ ఇప్పుడే కాదు. గత సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. మీరు మీ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకోండి. మీరు ఇన్సురెన్స్ పథకాల్లో లేకపోయినా అకౌంట్ నుండి డబ్బుల కట్ అవుతున్న విషయం గమనించి బ్యాంకు సిబ్బందిని కలిసి విచారించండి. తరచు మనీ కట్ కాకుండా నిలిపివేసే చర్యలు బ్యాంకు అధికారులు తీసుకుంటారు.