ప్రస్తుతం దేశంలో అనేక బ్యాంకులు ప్రజలకు వెసులు బాటులోకి వచ్చాయి. దీంతో ఆర్థిక లావాదేవీల్లో గతం కన్నా వేగంగా, త్వరిగతిన జరుగుతున్నాయి. అలాగే బ్యాంకుల ముందు పడి గాపులు పడకుండా నగదు ఉపసంహరణ తేలికగా జరిగేలా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు..
ప్రస్తుతం దేశంలో అనేక బ్యాంకులు.. వాటి సేవలను ప్రజలకు వెసులు బాటులోకి తెచ్చాయి. దీంతో ఆర్థిక లావాదేవీల్లో గతం కన్నా వేగంగా, త్వరిగతిన జరుగుతున్నాయి. అలాగే బ్యాంకుల ముందు పడి గాపులు పడకుండా నగదు ఉపసంహరణ తేలికగా జరిగేలా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వంటి సదుపాయాలు తెచ్చి.. ఏటీఎంలను ఏర్పాటు చేశారు. దీంతో సమయాలతో సంబంధం లేకుండా వీటి ద్వారా నగదు తీసుకునే అవకాశం దొరికింది. అయితే డెబిట్ కార్డుతో పోలిస్తే.. క్రెడిట్ కార్డుకు కొన్ని సదుపాయాలు, కొంత వెసులుబాటు, కొన్ని లిమిట్స్ ఉన్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు విదేశీ ఖర్చులకు సంబంధించి క్రెడిట్ కార్డు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అంటే విదేశాల్లో పర్యటించే సమయంలో కానీ అక్కడ చేసిన ఖర్చులు గానీ.. క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే లేదా దాన్ని వినియోగిస్తున్నట్లయితే ఈ వివరాలు తప్పక తెలుసుకోవాల్సిందే.
విదేశీ కరెన్సీలో ఎలాంటి ఖర్చులు చేస్తున్నారనేది ఇక బ్యాంకులకు తెలియజేయాల్సిందే. క్రెడిట్ కార్డు వినియోగదారులు.. వాటిని జారీ చేసిన బ్యాంకులకు .. అవి కోరిన సమయంలోపు డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. విదేశీ ఖర్చులపై ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) విధించాలనే ఉద్దేశంతో ఆదాయపు పన్ను శాఖ ఈ డిక్లరేషన్ నిర్ణయం తీసుకున్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. టీసీఎస్ విధింపు అంశంలో ఐటీ విభాగం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సహా ఇతర భాగస్వామ్య సంస్థలతో చర్చలు జరుపుతోంది. విదేశీ ఖర్చులకు సంబంధించి టీసీఎస్ 5 శాతం నుంచి 20 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రతిపాదనలు చేసిన సంగతి విదితమే. అంటే మెడికల్, ఎడ్యుకేషన్ మినహా ఇతర ఖర్చులకు 20 శాతం టీసీఎస్ వర్తింపు జేసేందుకు ఆదాయపు పన్ను విభాగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.ఆ కొత్త రూల్స్ జులై 1 నుంచే అమలులోకి రానున్నాయి.
ఇంతకు ఆ టీసీఎస్ రూల్ ఏమిటీ..?
జులై 1 నుంచి విదేశాల్లో క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చులు చేసినట్లయితే ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) కింద కట్ అవుతుంది. అయితే వ్యక్తిగత ఖర్చులు రూ.7 లక్షలు మించినట్లయితే వాటిపై 20 శాతం కట్ అవుతుంది. అయితే, ఆ ఖర్చులు వైద్యం, విద్య కోసం చేసినట్లయితే టీసీఎస్ 5 శాతం మాత్రమే కట్ అవుతుంది. ఇక విదేశాల్లో విద్య కోసం ఎడ్యు కేషన్ లోన్ తీసుకుంటే మాత్రం వాటిపై 0.5 శాతం మాత్రమే టీసీఎస్ పడుతుంది. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విదేశీలకు డబ్బులు పంపడం, విదేశీ టూర్ ప్యాకేజీలపై ఉన్న టీసీఎస్ 5 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్లు వార్షిక బడ్జెట్ 2023-24లో ప్రతిపాదించింది కేంద్రం. ఇక విదేశాల్లో పర్యటించే సమయంలో క్రెడిట్ కార్డుతో మాత్రం చెల్లించినట్లయితే భారం మరింత పెరగవచ్చు. సో క్రెడిట్ కార్డుతో విదేశాల్లో ఖర్చులు చేసేముందు వీటి గురించి తెలుసుకుంటే మంచిది.