భారతీయ రైల్వే వ్యవస్థ ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. ఇక రైల్వే వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ రూల్స్ కూడా కాస్త కఠినంగా ఉంటాయి. మీరు రైలు ప్రయాణించే సమయంలో ఎన్ని కఠినమైన రూల్స్ చూసి ఉంటారు. తాజాగా ఇండియన్ రైల్వే మరో కొత్త నిబంధన తీసుకొచ్చింది.
భారతీయ రైల్వే వ్యవస్థ ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. ఇక రైల్వే వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ రూల్స్ కూడా కాస్త కఠినంగా ఉంటాయి. మీరు రైలు ప్రయాణించే సమయంలో ఎన్ని కఠినమైన రూల్స్ చూసి ఉంటారు. తాజాగా ఇండియన్ రైల్వే మరో కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ రూల్ తెలుసుకోకపోతే మాత్రం మీరు తప్పక జరిమానా కట్టాల్సి రావచ్చు! ఇక భారతీయుల అవసరాన్ని బట్టి కొత్త రూల్స్ జారీ చేస్తూ ఉంటుంది. ఇవి కూడా ప్రయాణికుల రక్షణ కోసం, వారిని కంఫర్ట్ గా ఉంచడం కోసమే. ఇందులో భాగంగానే తాజాగా.. ఇండియన్ రైల్వే కొత్త రూల్ ఒకటి పాస్ చేసింది. ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం చేతిలో టికెట్ ఉన్నా..ఫైన్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి.. అంతటి కఠినమైన రూల్ ఏమిటి? ఎవరి కోసం ఇలాంటి రూల్ పెట్టారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో చాలా రైల్వే స్టేషన్స్ రద్దీగా ఉంటాయి. కానీ.., వారిలో ఎంత మంది ప్లాట్‌ఫారమ్ టికెట్ కొని ఉంటారు అంటే.. సగానికి తక్కువే అని చెప్పుకోవచ్చు. ఇంతకాలం ఏ విషయంలో కాస్త ఉదాసీనంగా ఉన్న ఇండియన్ రైల్వే ఇప్పుడు.. ఆ రూల్స్ కఠినతరం చేసింది. ఇంతకాలం ప్లాట్‌ఫారమ్ టికెట్ లేకుండా స్టేషన్ లో ఉన్న వారికి ఫైన్ విధిస్తూ వచ్చారు. ఒకవేళ వారి వద్ద జర్నీ టికెట్ ఉన్నా ఫైన్ వేసేవారు కాదు. కానీ.., ఇప్పుడు ప్లాట్‌ఫారమ్ పై ఉండటానికి జర్నీ టికెట్ కి కూడా కాలవ్యవధి విధించింది. ఇకపై జర్నీ టికెట్ తో ప్లాట్‌ఫారమ్ పై ఉండటానికి.. ప్రయాణించే 6 గంటల ముందు నుండి అనుమతి ఉంది. ఇది కేవలం రాత్రి వేళ ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే. అలాగే.. ఉదయం ప్రయాణాలు చేసే వారికి 2 గంటల ముందు వరకు మాత్రమే ప్లాట్‌ఫారమ్ పై ఉండే అనుమతి ఉంది.
ఈ సమయాలకన్నా ముందే స్టేషన్ కు చేరుకోవాలంటే మాత్రం ప్లాట్‌ఫారమ్ టికెట్ కొనాల్సిందే. అలా టికెట్ తీసుకోకుండా ఈ సమయాలకి ముందే ప్లాట్‌ఫారమ్ పై ఉంటే మాత్రం.. మన దగ్గర జర్నీ టికెట్ ఉన్నా.. జరిమానా కట్టాల్సి వస్తుంది. ఒకవేళ ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకుంటే మాత్రం ఆ రోజంతా ప్లాట్‌ఫారమ్ ఉండవచ్చు. ఇక ప్రయాణం పూర్తి అయ్యాక కూడా రాత్రి సమయాల్లో 6 గంటల పాటు, పగటి వేళల్లో 2 గంటల పాటు ప్లాట్‌ఫారమ్ పై ఉండొచ్చు. అంతకుమించి ఉంటే జరిమానా తప్పదట! ఈ కొత్త రూల్ తీసుకుని రావడానికి ప్రధాన కారణం.. స్టేషన్స్ లో రద్దీని తగ్గించడమే అట. మరి.. ఈ కొత్త నిబంధనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.