ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు పెట్టిన భారీ ఆఫర్ సేల్‌లో చాలా మంది అనేక వస్తువులు కొనుకున్నారు. అలాగే భారీ డిస్కౌంట్‌తో ఉన్న ఆపిల్ ఐఫోన్ 12ను ఆర్డర్ చేశాడు ఓ వినియోగదారుడు. దాదాపు రూ.53 వేల విలువగల ఐఫోన్‌ను ఆర్డర్ చేస్తే అందులో నిర్మ సబ్బు రావడంతో కస్టమర్ షాక్‌కు గురయ్యాడు. అయితే ఇలాంటి తప్పిదాలు గతంలో కూడా జరిగాయి. కేసులు కూడా నమోదు అయ్యాయి. దీంతో కస్టమర్ వెంటనే ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. ఐఫోన్ ఆర్డర్ చేస్తే రెండు నిర్మ సబ్బులు వచ్చాయని కస్టమర్ సిమ్రన్‌పాల్ సింగ్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. ఐఫోన్ బదులు సబ్బులు రావడంతో కస్టమర్ ఫిర్యాదు మేరకు ఫ్లిప్‌కార్ట్ స్పందించింది. డెలివరీ బాయ్‌తో మాట్లాడిన కంపెనీ.. తర్వా త జరిగిన తప్పును అంగీకరించింది. అతని డబ్బులను రీఫండ్ చేసింది.