క్రికెట్ దేవుడి అభయం – రైతు కూతురు చదువుకి ఆర్థిక సాయం!…

Your Dreams To Comes True Deepti : Sachin - Suman TV

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తు న్నారు. మాస్టర్ తాజాగా 19 ఏళ్ల యువతి చదువుకు తన వంతు సాయం అందించాడు. మహారాష్ట్రలోని రత్నగిరికి చెందిన 19 ఏళ్ల దీప్తి విశ్వాస్ రావు అనే యువతి డాక్టర్ కావాలనే కలను నెరవేర్చడానికి సచిన్ ముందుకు వచ్చాడు. దీప్తికల నెరవేరితే రత్నగిరిలోని జారీ గ్రామంలోనే మొదటి వైద్యురాలు అవుతుంది. ఇందుకోసం ఆమె రాత్రి, పగలు కష్టపడుతోంది. ఈ ప్రయత్నంలో ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా సచిన్ సేవా సంస్థ సహ్యోగ్ ఫౌండేషన్ ఆమె కల నెరవేర్చేందుకు ముందుకు వచ్చింది.

imgpsh fullsize anim 4 2రైతు కుటుంబంలో జన్మించిన దీప్తీ లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడానికి నెట్‌వర్క్ ఇబ్బందులను ఎదుర్కొంది. ఇందుకోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులన్నీ దాటుకొని కష్టపడి చదివింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్- నీట్ లో దీప్తి 720 మార్కులకు గాను 574 సాధించింది. ఆమెకు అకోలాలోని ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చింది. అయితే ఉన్నత చదువుకు అవసరమైన డబ్బును దీప్తి కుటుంబం సమకూర్చలేకపోయింది. ఇప్పటికే తన చదువు కోసం బంధువులు, తెలిసినవారి దగ్గర నుంచి అప్పు తీసుకొని ప్రవేశ రుసుము చెల్లించారు.

దీప్తి సంకల్పం గురించి సచిన్‌ టెండూల్కర్ ఫౌండేషన్‌ ‘ఎస్‌ఆర్‌టీ10’ దృష్టికి తీసుకెళ్ళింది. వెంటనే ఆ సంస్థ స్పందించి దీప్తి భవిష్యత్ కు భరోసానిస్తూ డాక్టర్ చదువు అయ్యేవరకూ అయ్యే ఖర్చులను తాము భరిస్తామని ప్రకటించింది. ఈ సమయంలో దీప్తి చదువుకు, ఇతర ఖర్చుల కోసం సచిన్ సహాయం అందించాడు. సేవా సంస్థ ద్వారా ఆమెకు స్కాలర్‌షిప్ ఇచ్చాడు.

సచిన్‌ అండతో దిప్తీ ఇప్పుడు నిర్భయంగా వైద్య విద్యను అభ్యసిస్తోంది. ఈ నేపథ్యంలో ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ సచిన్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.