ఐపీఎల్ సెకెండాఫ్ ప్రతి మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ప్రతి జట్టు అభిమాని తమతమ జట్లు గెలుస్తాయంటూ సోషల్ మీడియా వేదికగా యుద్ధాలే చేస్తున్నారు. మా జట్టంటే.. మా జట్టంటూ కొట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి తమ ఐడియాలజీ, నాలెడ్జ్ ప్రకారం కొందరు మాజీలు కూడా మ్యాచ్ ప్లాన్, టీమ్‌ల అంచనా, ప్రణాళికలు, గెలుపు- ఓటములపై తమ అభిప్రాయాలను ప్రిడిక్షన్లను చెబుతుంటారు. మరి అన్ని సందర్భాల్లో అవి నిజమవుతాయని వారు కూడా చెప్పరు. కానీ, ఒకటి రెండుసార్లైనా అది జరగాలి కదా? మరీ అన్నిసార్లు ఎలా రవర్స్ అవుతుందని ఐపీఎల్ అభిమానులు మాజీలైన గౌతమ్ గంభీర్, ఆకాశ్ చోప్రాలపై ట్రోలింగ్ చేస్తున్నారు.
స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్‌లో పాల్గొన్న గౌతమ్ గంభీర్ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ప్రిడిక్షన్ చెప్పాడు. పంజాబ్ సునాయాసంగా రాజస్థాన్‌పై విజయం సాధిస్తుందని చెప్పేశాడు. తీరా చూస్తే సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ని తీసుకెళ్లి రాజస్థాన్ చేతిలో పెట్టారు. మరోవైపు ఏబీడీ విషయంలోనూ గంభీర్ ప్లాన్ రివర్స్ అయ్యింది. గేమ్ ప్లాన్‌లో ఏబీడీ గురించి గంభీర్ చాలా బాగానే మోసేశాడు. ఇంకేముంది సిక్సుల వర్షం కురిపిస్తాడని చెప్పుకొచ్చాడు. తీరా చూస్తే ఏబీడీ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఇదేం నోరయ్యా అంటూ ఢిల్లీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఢీల్లీ మ్యాచ్‌కు మాత్రం ప్రిడిక్షన్ చెప్పకంటూ ట్రోల్ చేస్తున్నారు. నువ్వు చెప్పబట్టే పంజాబ్ మ్యాచ్ ఓడిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే గంభీర్ ప్లాన్‌కు రివర్స్‌గా ఫాలో అవ్వండంటూ సలహాలు ఇస్తున్నారు.
ఆకాశ్ చోప్రాను మరో లెవల్‌లో కామెంట్ చేస్తున్నారు. ఆకాశ్ చోప్రా పోడ్‌కాస్ట్‌లో మ్యాచ్ మొత్తాన్ని అనాలసిస్ చేసి ఎవరెన్ని వికెట్లు తీస్తారు. ఏ బౌలర్ ప్రభావం ఉంటుంది. ఏ బ్యాట్స్‌మన్ ఎంత స్కోర్ చేస్తారు. ఎవరు గెలుస్తారంటూ మొత్తం కూలంకషంగా విశ్లేషిస్తాడు. ఆకాశ్ చోప్రా లెక్కల ప్రకారం చెన్నై, ముంబయి మ్యాచ్‌లో ముంబయి విజయం సాధిస్తుంది. ఆర్సీబీ, కోల్‌కతా మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తుంది. పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధిస్తుంది. మరి అసలు ఆ మ్యాచ్‌లలో ఎవరు విజయం సాధించారు.. ఎంత తేడాతో గెలుపొందారు అన్నది అభిమానులు అందరూ చూశారు కదా. ఇంక, నెట్టింట్లో ఆకాశ్ చోప్రాను బెస్ట్ క్రికెట్ ప్రిడిక్టర్ ఇన్ ది వరల్డ్ అంటూ వ్యగ్యంగా ట్రోల్ చేస్తున్నారు.
హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్‌లో విజయం ఎవరు సాధిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.